మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ నుండి 85 యాప్స్ అవుట్

By Gizbot Bureau
|

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు నకిలీ యాప్స్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియకపోయినా యూజర్లు వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ వీటిపై కన్నేసింది.

Google removes 85 adware-infested apps from the Play Store

తన ప్లేస్టోర్‌లోని 85 యాప్‌లను ఫేక్ యాప్ ల కింద పరిగణించి వాటిని తొలగించింది. భద్రతా కారణాల రిత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని ఏరివేత కార్యక్రమాలు షురూ చేస్తామని కంపెనీ తెలిపింది.

యాడ్‌వేర్‌ మాల్‌వేర్‌

యాడ్‌వేర్‌ మాల్‌వేర్‌

యాడ్‌వేర్‌ అనే మాల్‌వేర్‌ రకం వైరస్‌ ఈ యాప్‌లలో ఉందంటూ ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించడంతో గూగుల్‌ వాటిని తొలగించింది. ఇవి ప్రతికూల యాడ్‌లను చూపించడమేగాక, వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయని గూగుల్‌ తెలిపింది.

ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువ

ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువ

తొలగించిన యాప్‌లలో ఎక్కువగా ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని, వీటిని ఇప్పటికే 8 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని గూగుల్‌ పేర్కొంది. వీటిలో సూపర్‌సెల్ఫీ, కాస్‌ కెమెరా, వన్‌ స్ట్రోక్‌ లైన్‌ పజిల్‌ లాంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ యాప్‌లను ప్లేస్టోర్‌లో వివిద ప్రాంతాలనుంచి అప్‌లోడ్‌ చేసినా.. అవి అన్నీ ఒకే రీతిలో ప్రవర్తిస్తుండటంపై అనుమానం వ్యక్తం చేసింది. వాటి పనితీరు ఒకే విధంగా ఉంటూ ఆందోళన కలిగించిందని తెలిపింది. అయితే ఈ యాడ్‌వేర్‌ పాత ఆండ్రాయడ్‌ ఫోన్‌లను ఏం చేయదని గూగుల్‌ పేర్కొంది.

 గతంలో కూడా కొన్ని యాప్స్ అవుట్

గతంలో కూడా కొన్ని యాప్స్ అవుట్

ఇదిలా ఉంటే గతంలో కూడా గూగుల్ కొన్ని యాప్స్ ని తొలగించింది. ఇందులో గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ యాప్స్ ఉన్నాయి. ఈ 85 యాప్స్‌ని 90 లక్షల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు గుర్తించారు.యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి అనవసరమైన అడ్వర్టైజ్‌మెంట్లను చూపించే యాడ్‌వేర్ యాప్స్ ని తొలగించింది.

13 గేమింగ్ యాప్స్‌ అవుట్

13 గేమింగ్ యాప్స్‌ అవుట్

ప్లే స్టోర్‌ నుంచి గూగుల్ యాప్స్ తొలగించడం ఇదేం కొత్త కాదు. ఇటీవల 22 యాప్స్‌లో మాల్‌వేర్ గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్ ఆండ్రాయిడ్ డివైజ్‌లల్లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తోందని గూగుల్ గుర్తించింది. వాటిని 20 లక్షల సార్లు డౌన్‌లోడ్ చేశారని తేలింది. అంతకు ముందు మరో 13 గేమింగ్ యాప్స్‌ని తొలగించింది. వాటిని 56,00,000 యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Best Mobiles in India

English summary
Google removes 85 adware-infested apps from the Play Store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X