వాళ్లకు యూట్యూబ్ సేవలు బంద్ !

By: Madhavi Lagishetty

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్...అమెజాన్ పై మండిపడింది. తన లైవ్ స్ట్రీమ్ అప్లికేషన్ యూట్యూబ్..అమెజాన్ కు చెందిన రెండు డివైజుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమకు సంబంధించిన హార్డ్ వేర్ ను విక్రయించడంలేదని అమెజాన్ పై మండిపడింది. ఆ కంపెనీకి చెందిన ఎకోషో, ఫైర్ టీవీ స్టిక్ డివైసులకు యూట్యూబ్ సేవలను నిలిపివేసినట్లు గూగుల్ ప్రకటించింది.

వాళ్లకు యూట్యూబ్ సేవలు బంద్ !

ఒకరి ఉత్పత్తులు, సేవలను మరొకరు వినియోగించుకునే విషయంపై అమెజాన్ తో ఒప్పందం ఉందని గూగుల్ తెలిపింది. అయితే త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము ఒక ఒప్పందాన్ని చేసుకోనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్ ఉత్పత్తులైన క్రోమ్ కాస్ట్, గూగుల్ హోంలను తమ ఆన్ లైన్లో విక్రయించడంలేదని...గూగుల్ కాస్ట్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియోలను అందుబాటులో ఉంచడంలేదని తెలిపింది. దీంతో తాము ఎకోషో, ఫైర్ టీవీ స్టిక్ డివైసులకు యూట్యూబ్ సపోర్టును కొనసాగించడంలేదని తెలిపింది. అయితే వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించకోవాలని గూగుల్ భావిస్తోంది. కానీ వినియోగదారులకు ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ యాక్సెస్ చేయగలదు.

గూగుల్ మరియు అమెజాన్ మధ్య అంతరాలు చాలా ఏండ్ల నుంచి ఉన్నాయి. ఎందుకంటే అమెజాన్, గూగుల్ ఒకటితో మరొకటి పోటిపడతాయి. అమెజాన్ యాపిల్ టీవీ ప్లేయర్ తోపాటు 2015లో దాని రిటైల్ వెబ్ సైట్ నుంచి క్రోమ్ కాస్ట్, గూగుల్ టెలివిజన్ ప్లేయర్ను తొలగించింది. అమెజాన్ విక్రయించిన డివైసులలో దాని ప్రధాన వీడియో సర్వీసు అందుబాటులో ఉండవచ్చన్న గందగోళంగా ఉంది. అయితే వినియోగదారుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేసినట్లు అమెజాన్ వివరించింది.

శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్, భారీ డిస్కౌంట్లు..

అమెజాన్ మరియు యాపిల్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యాపిల్ టీవీ ప్రైమ్ వీడియో వచ్చినట్లు ప్రకటించింది. కానీ గూగుల్ తో ఎలాంటి మార్పు వచ్చినట్లు కనపించలేదు. సెప్టెంబర్ లో గూగుల్ అమెజాన్ ఎకో షో నుంచి యూట్యూబ్ ను తొలగించాలని ఒత్తిడి చేసింది.

వీడియో టచ్ స్క్రీన్లో,వీడియో రికమండేషన్స్ , ఛానెల్ సబ్ స్క్రైబర్స్, మరియుఇతర ఫీచర్లు లేకుండా వీడియోలను డిస్ల్పే చేసింది. అమెజాన్ తర్వాత డివైసుకు యూట్యూబ్ ను మళ్లీ జోడించింది. కానీ వాయిస్ కమాండ్స్ ఉల్లంఘించాయని గూగుల్ సర్వీసును నిలిపివేసింది.

ఫైర్ టీవీ తన యూట్యూబ్ యాప్ కు జనవరి 1 నుంచి ప్రారంభించబడదని...గూగుల్ ప్రకటించింది. అమెజాన్ ఆ డివైసును ఎకో షో కంటే ఎక్కువ కాలం విక్రయించింది. ఈ నిర్ణయంతో మరింత మంది కస్టమర్లకు యూట్యూబ్ సేవలు బంద్ కానున్నాయి.

Read more about:
English summary
As of today, though, Google is putting its foot down and officially pulling support for YouTube
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot