Home
News

హువాయి ఫోన్లపై నిషేధాన్ని ఎత్తివేసిన గూగుల్ !

By Gizbot Bureau

ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన చైనా దిగ్గజం హువాయి కంపెనీకి గూగుల్ నుంచి భారీ షాక్ తగిలిన విషయం అందరికీ తెలిసిందే. యూఎస్, చైనా ట్రేడ్ వార్ సమయంలో అమెరికా ఆంక్షలను సరించి ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు చేస్తూ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

Google Removes Ban On Huawei Phones, Restores Android & Apps Access

అయితే ఇప్పుడు కంపెనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హువాయి స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్తను అందిస్తూ గూగుల్ హువాయి ఫోన్లపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక నుంచి ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ హువాయి ఫోన్లలో పనిచేస్తాయి.

 అమెరికా కూడా ఆంక్షలను రద్దు చేసే అవకాశం

అమెరికా కూడా ఆంక్షలను రద్దు చేసే అవకాశం

చైనీస్ టెక్ దిగ్గజం హువాయి కంపెనీతో యూఎస్ టెక్ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలపై, చైనా, అమెరికా ట్రేడ్ వార్ పై గతవారంలో జరిగిన అంతర్జాతీయ G20 సమ్మిట్ లో ఇరుదేశాల అధినేతలు చర్చించారు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనా టెక్ కంపెనీలపై అమెరికా కూడా ఆంక్షలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

గూగుల్ ముందుగానే

గూగుల్ ముందుగానే

అప్పటివరకూ సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో గూగుల్ ముందుగానే హువాయి ఫోన్లలో ఆండ్రాయిడ్, ప్లే స్టోర్ యాప్స్, సర్వీసులకు యాక్సస్ ఇస్తూ అన్నింటిని రీసోర్ట్ చేసినట్టు ఓ రిపోర్ట్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం మార్గదర్శకాలతో హువాయిపై బ్యాన్ చేసింది ఒక గూగుల్ మాత్రమే కాదు.. ఇతర యూఎస్ సెల్లింగ్ టెక్ కంపెనీలైన క్వాల్ కామ్న్, ఇంటెల్ కు కంపెనీల ఉత్పత్తులపై కూడా ఆంక్షలు విధించింది.

 చైనాకు అనుకూలంగా నిర్ణయం

చైనాకు అనుకూలంగా నిర్ణయం

జపాన్‌లో జరిగిన జీ20 సదస్సు చైనా అమెరికాల మధ్య వాణిజ్య వార్ ఆందోళనకు ముగింపు పలికింది. చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ వాణిజ్య పరంగా ఒక అవగాహనకు వచ్చారు. దీంతో ట్రంప్ చైనాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. హువాయిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నామంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

 దేశ భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు

దేశ భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు

అమెరికన్ కంపెనీలు అత్యంత సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వీటిని అవి మాత్రమే తయారు చేయగలవు. అందుకని ఈ ఉత్పత్తులను హువాయికు విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీలకు అనుమతిచ్చింది. ఈ లావాదేవీ వల్ల దేశ భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది," అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.

సుం‍కాల పోరు తప్పుతుందని

సుం‍కాల పోరు తప్పుతుందని

చైనా ఎగుమతులపై కొత్త సుంకాలను అమెరికా విధించదని, ఇరుదేశాలు వాణిజ్య, ఆర్థిక చర్చలను పునఃప్రారంభించాడానికి అంగీకరించాయని చైనా మీడియా ప్రకటించింది. ఇరుదేశాల మధ్య పూర్తి ఒప్పందం జరగకపోవచ్చు కానీ సంధి జరగడం వలన కొత్తగా సుం‍కాల పోరు తప్పుతుందని ఇది సానుకూల పరిణామమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

ఘర్షణ కన్నా చర్చలు

ఘర్షణ కన్నా చర్చలు

తమతో సంధికి రాకుంటే ‘చైనా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని హెచ్చరిస్తూనే, చైనాతో రాజీ కుదుర్చుకునేందుకు ఈ సమావేశం ముందునుంచే ట్రంప్‌ సిద్దపడ్డారు. ఇరుదేశాల అధ్యక్షలు చర్చలను బహిష్కరించాకా జిన్‌పింగ్‌ ఘర్షణ కన్నా చర్చలు ఫలితాలనిస్తాయని తెలిపిన విషయం తెలిసిందే. చైనాతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఎదురుచూస్తున్నాం అని ట్రంప్‌ కూడా అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంశాలు ఇంకా బయటకు రాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Removes Ban On Huawei Phones, Restores Android & Apps Access Like Nothing Happened
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X