Google ప్లే స్టోర్ లో మూవీస్ & టీవీ ట్యాబ్‌లు తొలగింపు!! కొత్తగా ఈ స్థానంలో గూగుల్ టీవీ

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ పరికరాల్లోని ప్లే స్టోర్ యాప్ నుండి మూవీస్ & టీవీ ట్యాబ్‌ను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల నుండి తమ 'మూవీస్ మరియు టీవీ' విభాగాన్ని రిటైర్ చేస్తున్నట్లు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది. వినియోగదారులు ఇకపై ఆండ్రాయిడ్ లోని ప్లే స్టోర్ యాప్ నుండి టెలివిజన్ కార్యక్రమాలు మరియు మూవీస్లను బ్రౌజ్ చేయలేరు, సెర్చ్ చేయలేరు మరియు కొనుగోలు చేయలేరు లేదా అద్దెకు తీసుకోలేరు. అయితే దీనికి బదులుగా గూగుల్ టీవీని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వినియోగదారులు ఇటీవల అప్ డేట్ చేయబడిన 'హైలైట్‌లు' న్యూస్ ఫీడ్‌తో వారి లైబ్రరీని చూడవచ్చు.

 

గూగుల్ కొత్త అప్‌డేట్

గూగుల్ కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్ ప్రకారం ఆండ్రాయిడ్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి 'మూవీస్ మరియు టీవీ' ట్యాబ్ ని తొలగించబోతోంది. గూగుల్ టీవీ అనేది దీనికి ప్రత్యామ్నాయంగా విడుదలైంది. ఇక్కడ వినియోగదారులు గూగుల్ టీవీ నుండి కొనుగోలుచేయాలనుకునే మీడియాను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు మరియు అద్దెకు తీసుకోవచ్చు. గూగుల్ టీవీలో 'హైలైట్స్' న్యూస్ ఫీడ్ అనే ఇటీవల అప్‌డేట్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా ప్లే స్టోర్ అప్లికేషన్‌లోని వినియోగదారు కోరికల జాబితాలో మునుపటి కొనుగోళ్లు, పేమెంట్స్ (Play క్రెడిట్ మరియు గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించడం), రీఫండ్‌లు మరియు Play పాయింట్‌లకు చాలా మార్పులు లేవు.

Airtel Xstream ఫైబర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! 17 OTTలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్Airtel Xstream ఫైబర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! 17 OTTలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

ఆండ్రాయిడ్

అదే సమయంలో ఆండ్రాయిడ్ పరికరాలలో ప్లే స్టోర్ అప్లికేషన్ నుండి సినిమాలు మరియు TV విభాగాన్ని తీసివేసిన తర్వాత వినియోగదారులు ఇప్పుడు ట్యాబ్‌లు, గేమ్‌లు, యాప్స్ మరియు బుక్స్ వంటి మూడు విభాగాలను మాత్రమే చూస్తారు. అయితే వారు అప్లికేషన్‌లో ఆఫర్స్ లేదా ప్లే పాస్ వంటి నాల్గవ ఎంపికగా కలిగి ఉండవచ్చు.

Google TV
 

"Google TV తాజా అప్ డేట్ లో మీరు గూగుల్ ప్లే మూవీస్ & TVలో మీరు ఉపయోగించిన అదే అనుభవాన్ని గొప్ప డీల్‌లతో పాటుగా గొప్ప సిఫార్సులతో పొందుతారు" అని Google ఈ సందర్భంగా వివరించింది. ఇది కాకుండా ఈ యాప్‌లు లొకేషన్, ఫోన్ నంబర్‌లు మరియు ఇమెయిల్ అడ్రస్‌లతో సహా వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నాయని కంపెనీ గుర్తించిన తర్వాత Google గత నెలలో దాని ప్లే స్టోర్ నుండి అనేక యాప్‌లను తీసివేసింది.

గూగుల్ మొదటి ఫోల్డబుల్ ఫోన్

గూగుల్ మొదటి ఫోల్డబుల్ ఫోన్

US ఆధారిత సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ 'పిక్సెల్ ఫోల్డ్'ని 2022 ఈ సంవత్సరం లాంచ్ చేస్తుందని భావించారు. అయితే ఇప్పుడు గూగుల్ యొక్క ఈ ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ ఈ సంవత్సరం లాంచ్ కావడం లేదని మరియు వచ్చే ఏడాది 2023 సంవత్సరంలో లాంచ్ కానున్నట్లు కొన్ని నివేదికలు కొత్తగా రిపోర్టుని విడుదల చేసాయి. గూగుల్ బ్రాండ్ నుంచి వచ్చే మొదటి ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్ మీద అనేక అంచనాలు ఉన్నాయి. గూగుల్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌లలో విడుదల చేయనున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో గొప్ప ఆఫర్‌లను అందించవచ్చు అని భావించబడింది. హార్డ్‌వేర్ పరంగా LTPO మరియు 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్‌తో గెలాక్సీ Z ఫోల్డ్ 3 పరిమాణంలో పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఉంటుందని అంచనా వేయబడింది. ఆండ్రాయిడ్ 12 ఆప్టిమైజ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 12L తో రన్ అయ్యే టాబ్లెట్‌లు, ఫోల్డబుల్‌లు మరియు క్రోమ్ OS డివైస్లను విడుదల చేయనున్నట్లు గూగుల్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మాదిరిగానే ఫోల్డ్ చేసే విధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ 7.6-అంగుళాల స్క్రీన్ పరిమాణంతో లభించవచ్చని సూచించబడింది. ఫోల్డబుల్ పిక్సెల్ ఏ రకమైన ఫోల్డింగ్ సిస్టమ్‌ను అవలంబించనుందనే దానిని ధృవీకరించలేదు కానీ ఇది నిలువుగా ఫోల్డ్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు సూచిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Google Removing Movies and TV Tab From Play Store on Android: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X