Home
News

ఆండ్రాయిడ్‌లో జెమిని ఓవర్‌లే కొత్త అవతారం, చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

By Ram Kumar

గూగుల్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ జెమిని బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఇది సరికొత్త రూపంతో మన ముందుకు రానుందా? ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో జెమిని కనిపించే విధానంలో గూగుల్ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెడిట్‌ యూజర్ amitsama92, గూగుల్ పిక్సెల్ సబ్‌రెడిట్‌లో ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Google Revamps Gemini  A Sleek New Overlay Window for Android

ప్రస్తుతం వాడుతున్న పద్ధతిలో కాకుండా, జెమిని అసిస్టెంట్‌ను వాయిస్ కమాండ్ ద్వారా గానీ లేదా మాన్యువల్‌గా గానీ యాక్టివేట్ చేసినప్పుడు ఈ సరికొత్త డిజైన్ కనిపిస్తుందని తెలుస్తోంది.

పిక్సెల్ 9 ప్రో వాడుతున్నానని, ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్ 1.0.686588308ను ఉపయోగిస్తున్నానని తెలిపిన amitsama92, జెమిని అడ్వాన్స్‌డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న తర్వాత ఈ కొత్త డిజైన్‌ను చూసినట్లు పేర్కొన్నారు.

* క్లారిటీ లేదు

అయితే, ఈ కొత్త ఇంటర్‌ఫేస్ డివైజ్‌కు సంబంధించినదా, యాప్ వెర్షన్‌కు సంబంధించినదా లేదా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సంబంధించినదా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

అయితే, ఈ విషయంపై రెడిట్‌లో చాలా మంది యూజర్లు స్పందించారు. కొందరు తాము కూడా కొత్త ఇంటర్‌ఫేస్‌ను చూసినట్లు చెప్పగా, మరికొందరు మాత్రం తమకు ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిపారు. దీంతో గూగుల్ నిజంగానే జెమినీలో మార్పులు చేస్తోందా అనే చర్చ మొదలైంది.

* కొత్త ఓవర్‌లేలో కనిపించే ఫీచర్లు

స్క్రీన్‌షాట్ ప్రకారం, కొత్త జెమినీ ఓవర్‌లే ఈ కింది ఫీచర్లతో రానుంది.

- ఆకారం, పరిమాణం

పాత డిజైన్‌లో పెద్ద చతురస్రాకారంలో కనిపించే ఓవర్‌లే, ఇప్పుడు సన్నని, దీర్ఘచతురస్రాకారపు పెట్టెలా కనిపిస్తోంది. ఇది స్క్రీన్ పైన తేలియాడుతూ ఉంటుంది.

- ఐకాన్లు

ఈ కొత్త డిజైన్‌లో కొన్ని కొత్త ఐకాన్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఎడమ వైపు ప్లస్ (+) ఐకాన్ ఉండగా, కుడి వైపున మైక్రోఫోన్, జెమిని లైవ్ ఐకాన్లు కనిపిస్తున్నాయి. ఈ ఐకాన్ల ద్వారా ఎక్స్‌ట్రా ఫీచర్లను యాక్సెస్ చేసే అవకాశం ఉండవచ్చు.

* బ్రైట్ లుక్

ఈ కొత్త ఓవర్‌లే ముఖ్యంగా దాని రంగులతో ఆకట్టుకుంటోంది. నియాన్ పింక్, నీలం రంగుల మిరుమిట్లు గొలిపే ఔట్‌లైన్‌తో ఈ బాక్స్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

- స్వాగతం, స్పార్కల్ ఐకాన్ మాయం

ప్రస్తుత డిజైన్‌లో కనిపించే వెల్కమ్ మెసేజ్, పైన ఉండే మెరుపు గుర్తు (Sparkle icon) ఈ కొత్త డిజైన్‌లో కనిపించకపోవడం గమనార్హం.

- రంగు మారింది

ఇప్పటివరకు ముదురు బూడిద (Dark grey) రంగులో ఉన్న ఓవర్‌లే బ్యాక్‌గ్రౌండ్, ఇప్పుడు తెలుపు రంగులోకి మారింది. ఇది ఇంటర్‌ఫేస్‌కు మరింత ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది.

- ఫుల్-స్క్రీన్ బటన్ లేదు

పాత డిజైన్‌లో కుడివైపు పైన కనిపించే ఫుల్-స్క్రీన్ ఆప్షన్ ఈ కొత్త డిజైన్‌లో కనిపించడం లేదు. బహుశా గూగుల్ ఈ ఫీచర్‌ను తొలగించి ఉండవచ్చు లేదా వేరే విధంగా అందుబాటులోకి తీసుకురావొచ్చు.

- లిమిటెడ్ అవైలబిలిటీ మాత్రమేనా?

ప్రస్తుతానికి ఈ కొత్త డిజైన్ కేవలం టెస్టింగ్ దశలో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు రెడిట్‌ యూజర్లు కొత్త డిజైన్‌ను చూసినట్లు ధృవీకరించినప్పటికీ, చాలా పరికరాల్లో ఇది ఇంకా కనిపించలేదు.

ఉదాహరణకు, గ్యాడ్జెట్స్‌ 360, 9to5Google సిబ్బంది తమ ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను చూడలేకపోయామని నివేదించారు.

కాబట్టి, ఈ అప్‌డేట్ పరిమిత సంఖ్యలో యూజర్లకు లేదా కొన్ని నిర్దిష్ట డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. ఈ కొత్త జెమిని ఇంటర్‌ఫేస్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోవాలంటే గూగుల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
Google is testing a new design for the Gemini overlay on Android. It features a thinner, rectangular shape with a glowing outline and new icons. This redesigned overlay is currently in a limited testing phase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X