Home
News

ఈ సెక్యూరిటీ ఫీచర్‌ మీ ఫోన్‌లో ఉంటే.. డివైజ్‌ను ఎవరూ ఓపెన్‌ చేయలేరు.. ఎలా పనిచేస్తుంది..?

స్మార్ట్‌ఫోన్‌ ల వినియోగం ప్రస్తుతం భారీగా పెరిగింది. కాలింగ్‌, డేటా అవసరాలతోపాటు బ్యాంకింగ్‌ పనులను సులభంగా స్మార్ట్‌ఫోన్‌ ల ద్వారా చేస్తుంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ల లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతోపాటు ఇతర కీలక సమాచారాన్ని స్టోర్‌ చేస్తున్నాం. అయితే ఏదైనా పరిస్థితుల్లో ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా.. అందులోని డేటా దుర్వినియోగం అవుతుందనే ఆందోళన కలుగుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ డేటాను సురక్షితంగా ఉంచేందుకు అనేక ఫీచర్‌ లు అందుబాటులోకి వచ్చాయి.

డేటా సురక్షితంగా ఉండేలా :
ఈ ఫీచర్‌లు స్మార్ట్‌ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా అందులోని డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా నియంత్రిస్తాయి. దీంతోపాటు కొన్ని ఫీచర్‌ల ద్వారా ఫోన్ లొకేషన్‌ తెలుసుకొనే అవకాశం కూడా ఉంది. అయితే తాజాగా గూగుల్‌ మరో సరికొత్త Theft Protection ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Google Rolling out Identity check feature

ఐడెంటిటీ చెక్ పేరుతో (Google Identity Check Feature) ఈ ఫీచర్‌ ను గూగుల్‌ విడుదల చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా ఇతరులు మీ ఫోన్‌ ను ఉపయోగించేందుకు అవకాశం ఉండదు. దీంతోపాటు మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది.. ఈ ఫీచర్‌ ను సపోర్టు చేసేందుకు మీ ఫోన్‌ ఎలాంటి స్పెసిఫికేషన్‌ లను కలిగి ఉండాలి.

ఈ లొకేషన్‌ లలో మాత్రమే :
గూగుల్‌ తాజాగా తీసుకొచ్చిన ఐడెంటిటీ చెక్‌ ఫీచర్‌.. స్మార్ట్‌ఫోన్‌ కు మరింత మెరుగైన భద్రతను ఇస్తుందని చెబుతోంది. ఈ ఫీచర్‌ లో మీరు కొన్ని లొకేషన్‌ లను యాడ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో మీ ఫోన్‌ ను తెరిచేందుకు కచ్చితంగా ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ పిన్ తెలిసినా ఓపెన్ కాదు :
అయితే మీరు నమోదు చేసుకున్న ప్రాంతాల్లో మీ ఐడెంటిటీని ప్రతి సారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతోపాటు మీ ఫోన్‌ పిన్‌ ఇతరులకు తెలిసినా.. డివైజ్‌ ఓపెన్‌ కాదని తెలుస్తోంది. అయితే తొలిదశలో ఈ ఐటెంటిటీ చెక్‌ ఫీచర్‌ గూగుల్ పిక్సల్, శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ లకు అందుబాటులోకి వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లలోనే పనిచేస్తుంది :
ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా పనిచేసే గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌ లో పనిచేస్తుంది. గూగుల్‌ పిక్సల్‌ 6, పిక్సల్‌ 7, పిక్సల్‌ 8, పిక్సల్‌ 9 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ లు సహా పిక్సల్‌ ఫోల్డ్‌ ఫోన్‌లు ఈ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. త్వరలో మరిన్ని బ్రాండ్ల ఫోన్‌లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్‌ తెలిపింది.

అయితే పిక్సల్‌ ఫోన్‌లతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 OS పైన పనిచేసే శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లలోనూ ఈ ఫీచర్‌ ను ఉపయోగించుకోవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌ ఈ OS ను కలిగి ఉంది. గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌, గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌లు ఈ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి.

మరో సెక్యూరిటీ ఫీచర్‌ :
దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 10 లేదా అంత కంటే కొత్త వెర్షన్‌ OS లతో పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ లు ప్రస్తుతం Theft Detection Lock ఫీచర్‌ ను కలిగి ఉన్నాయి. ఇతరులు మీ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ కానుంది. ఫలితంగా డివైజ్‌ లాక్‌ చేయబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X