Home
News

జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆప్షన్‌ వచ్చేస్తోంది..!

Gmail Username changes : జీమెయిల్‌ వినియోగం ఇటీవల కాలంలో అధికమవుతోంది. వివిధ ఆన్‌లైన్‌ దరఖాస్తులు సహా యాప్స్‌ వినియోగానికి మెయిల్‌ అవసరం అవుతోంది. అయితే కొంత మంది తమకు నచ్చిన విధంగా జీమెయిల్‌ ను క్రియేట్‌ చేసుకుంటున్నారు. అయితే మరికొంత మందికి ఈ అవకాశం ఉండడం లేదు. వారికి నచ్చిన జీమెయిల్‌ ఐడీ యూజర్‌ నేమ్ అందుబాటులో ఉండకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఐడీతో మెయిల్‌ ను క్రియేట్‌ చేసుకుంటున్నారు.

వారికి నిజంగా గుడ్‌ న్యూస్ :
అత్యవసర సమయాల్లో జీమెయిల్‌ అవసరమవ్వడంతో అందుబాటులో ఉన్న ఐడీతో మెయిల్‌ ను క్రియేట్‌ చేసిన వాళ్లు. అనేక మందే ఉంటారు. అయితే అలాంటి వారికి నిజంగా ఇది గుడ్‌ న్యూస్‌. ఇలాంటి ఒక ఆప్షన్‌ ఉంటే బాగుంటుందని ఎదురుచూస్తున్న జీమెయిల్‌ వినియోగదారులకు ఇదో మంచి అవకాశం ఇవ్వనుంది గూగుల్.

Google rolling out new feature to change username in gmail ID soon here are the details

యూజర్‌నేమ్‌ లో మార్పులు చేసుకోవచ్చు :
గూగుల్‌ నుంచి వచ్చిన తాజా ప్రకటన ఆధారంగా జీమెయిల్ ఐడీలో మార్పులు చేసుకోవచ్చు. అంటే యూజర్‌నేమ్‌ లో మార్పులు చేసుకోవచ్చు. ఫలితంగా కొత్త జీమెయిల్‌ అకౌంట్‌ ను క్రియేట్‌ చేయాల్సిన అవసరం తప్పుతుంది. ఈ ఆప్షన్‌ ప్రస్తుతం @gmail.com డొమైన్‌ ను వినియోగిస్తున్న ఈ- మెయిల్‌ ఐడీలకు వర్తిస్తుందని తెలుస్తోంది.

గూగుల్‌ ఐడీలో మార్పులు చేసినా :
గూగుల్‌ సపోర్టు పేజీ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. జీమెయిల్‌ లోని @gmail.com అలానే ఉంచి, మిగిలిన అడ్రస్‌ ను మార్చుకోవచ్చు. సింపుల్‌ గా చెప్పాలంటే జీమెయిల్‌ యూజర్లు తమకు నచ్చిన పేరుతో జీమెయిల్‌ ఐడీలో మార్పులు చేసుకోవచ్చు. ఇందులో ఇంకో ప్రత్యేకత ఎంటంటే.. జీమెయిల్‌ ఐడీలో మార్పులు చేసినా.. గూగుల్‌ దాన్ని పాత మెయిల్ ఐడీగానే గుర్తిస్తుంది.

Google rolling out new feature to change username in gmail ID soon here are the details

పాత అడ్రస్‌ కు మెయిల్స్ వస్తూనే ఉంటాయి :
జీమెయిల్‌ ఐడీలో మార్పులు మీ పాత మెయిల్‌ ఐడీకి వచ్చే మెసేజ్‌ లు, మెయిల్స్‌ నిలిచిపోతాయనే భయం ఉండదు. ఆ మెయిల్‌ ఐడీతో లింక్‌ అయిన అన్ని సేవలు అలానే కొనసాగుతాయి. జీమెయిల్‌ సెట్టింగ్స్ ఆప్షన్‌ ద్వారా ఈ మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ కొంత మంది యూజర్లకే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే పరిమితులున్నాయ్‌ :
జీమెయిల్‌ ఐడీని మార్పులు చేసుకొనే అవకాశం త్వరలో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే జీమెయిల్‌ ఐడీని ఇష్టానుసారం మార్పులు చేసేందుకు అవకాశం లేదని తెలుస్తోంది.

సంవత్సరానికి ఒకసారి.. గరిష్ఠంగా.. :
త్వరలో అందుబాటులోకి రానున్న ఆప్షన్ ద్వారా ఒకసారి జీమెయిల్‌ ఐడీలో మార్పులు చేసుకుంటే 12 నెలల వరకు మరోసారి మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. అలాగే మొత్తంగా 3 సార్లు మాత్రమే జీమెయిల్‌ ఐడీని మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫలితంగా నచ్చిన విధంగా జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X