గూగుల్ Theft Protection ఫీచర్‌ను విడుదల చేస్తోంది.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాలు..
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడినా.. అందులోని డేటా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ ఈ అత్యాధునిక Theft Protection ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అధికారికంగా విడుదల చేస్తోంది. ఈ ఫీచర్‌ను i/o 2024 ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఈ ఫీచర్ ఏయో పరికరాలకు సపోర్టు చేస్తుంది, ఎలా పనిచేస్తుంది వంటి వివరాలతో పూర్తి కథనం.
గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ (Google Theft Protection) ఆండ్రాయిడ్ 10 కంటే అప్‌డేట్ వెర్షన్ కలిగిన పరికరాలను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత డేటాకు రక్షణ కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పొగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన సందర్భాల్లో హ్యాండ్‌సెట్‌లోని డేటాను భద్రంగా ఉంచుతుంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం విడుదల చేయడం ప్రారంభించింది.

ఈ Theft Protection ప్రధానంగా మూడు ఫీచర్‌ను కలిగి ఉంటుంది. థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ఆఫ్‌లైన్ డివైస్ లాక్, రిమోట్ లాక్ లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ యాప్‌లో Theft Protecion పేరుతో సెర్చ్ చేయవచ్చు. లేదా గూగుల్ సర్వీ్స్> ఆల్ సర్వీస్ > పర్సనల్ & డివైస్ సేఫ్టీ పైన క్లిక్ చేసి ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
థెఫ్ట్ డిటెక్షన్ లాక్ : మీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న (Unlocked Phone) సమయంలో ఎవరైనా దొంగిలిస్తే.. సెన్సార్‌లు, వైఫై, ఇతర స్మార్ట్ డివైస్ కనెక్షన్‌ల ద్వారా గుర్తిస్తుంది. దీంతో వెంటనే మీ ఫోన్‌ను లాక్ చేస్తుంది. ఫలితంగా మీ ఫోన్‌లోని సమాచారం దుర్వినియోగం కాకుండా చూస్తుంది.
ఆఫ్‌లైన్ డివైస్ లాక్ : మీ స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించిన వెంటనే లోకేషన్ ట్రాక్ చేయకుండా ఉండేందుకు వీలుగా ఫోన్ వైఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆఫ్ చేసిన సందర్భాల్లో ఇది పనిచేస్తుంది. అంటే మీ ఫోన్ వెంటనే లాక్ అవుతుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పుడు వ్యక్తిగత డేటా రక్షణ కోసం ఈ ఫీచర్ పనిచేస్తుంది.
రిమోట్ లాక్ : మీ స్మార్ట్ ఫోన్ దొంగిలించబడిన సమయంలో రిమోట్ లాక్ ఫీచర్ తో ఎక్కడ నుంచైనా హ్యాండ్‌సెట్‌ను లాక్ చేయవచ్చు. ఇందుకోసం android.com/lock వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ చేసి, మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయవచ్చు.
జూన్ 2024 లో గూగుల్ ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను బ్రెజిల్‌లో పరీక్షించింది. ప్రస్తుతం పిక్సల్, శాంసంగ్ సహా ప్రపంచంలోని వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్ల డేటాకు రక్షణ కల్పించేందుకు గూగుల్ ఇప్పటికే అనేక ఫైండ్ మై డివైస్ వంటి ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇటీవల గూగుల్ ఫర్ ఇండియా 10వ ఎడిషన్‌ను అక్టోబర్ 3న నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లపై కీలక ప్రకటనలు చేసింది. గూగుల్ లైవ్‌ను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషలను సపోర్టు చేస్తుందని వెల్లడించింది.
గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. దీంతో మంచు, వరదల సమయాల్లో వాహనదారులకు రియల్‌టైం అప్‌డేట్ అందిస్తాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లోకి 170 మిలియన్‌ల నకిలీ రివ్యూలను తొలగించినట్లు గూగుల్ తన 10వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications








