ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని పిక్సెల్ ఫోన్‌ల కోసం విడుదల చేసిన గూగుల్...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ తన యొక్క పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో శామ్సంగ్, షియోమీ, నోకియా వంటి మరికొన్ని బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త OS వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 13 వెర్షన్ వినియోగదారులను వ్యక్తిగత యాప్‌లలో నిర్దిష్ట భాషలను కేటాయించడానికి అనుమతిస్తుంది. ఇది అప్‌డేట్ చేయబడిన మీడియా ప్లేయర్‌తో కూడా వస్తుంది. ఇది వినియోగదారులు వింటున్న సంగీతం లేదా పాడ్‌కాస్ట్ ఆధారంగా దాని రూపాన్ని మారుస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు త్వరలో కొత్త OS వెర్షన్‌తో వారి హ్యాండ్‌సెట్ నుండి వారి Chromebookకి మెసేజింగ్ యాప్‌ను ప్రతిబింబించగలరు.

 

ఆండ్రాయిడ్ 13 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లభ్యత

ఆండ్రాయిడ్ 13 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లభ్యత

టెక్ దిగ్గజం ఆండ్రాయిడ్ 13 యొక్క స్థిరమైన వెర్షన్‌ను తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల చేయడం ప్రారంభించినట్లు గూగుల్ ప్రకటించింది. చేంజ్లాగ్ ప్రకారం గూగుల్ పిక్సెల్ 4 XL, పిక్సెల్ 4a, పిక్సెల్ 4a 5G, పిక్సెల్ 5, పిక్సెల్ 5a 5G, పిక్సెల్ 6, పిక్సెల్ 6 Pro మరియు పిక్సెల్ 6a వంటి ఫోన్‌లు కొత్త అప్‌డేట్‌ను పొందుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ శామ్సంగ్ గెలాక్సీ, ఆసుస్, HMD (నోకియా ఫోన్స్), iQOO, మోటరోలా, వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మీ, షార్ప్, సోనీ, టెక్నో, వివో, షియోమి వంటి బ్రాండ్‌ల యొక్క ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కొత్త విషయాలు
 

ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కొత్త విషయాలు

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఫోన్ లోని యాప్‌లు, గూగుల్ అసిస్టెంట్, ఆడియో, ఛార్జింగ్ వంటికి సంబంధించిన అనేక బగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ అప్‌డేట్‌తో గుర్తించదగిన మరియు చెప్పుకోదగ్గ పరిష్కారం బయోమెట్రిక్‌లకు సంబంధించినది. ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ సమయంలో యాప్ క్రాష్ అయ్యే సమస్యను అప్‌డేట్ పరిష్కరిస్తుందని గూగుల్ తెలిపింది. ఇది నోటిఫికేషన్ షేడ్ డౌన్‌లో ఉన్నప్పుడు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ని ఉపయోగించడానికి వినియోగదారులను అప్పుడప్పుడు అనుమతించదు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ని ట్రిగ్గర్ చేయడానికి అనుమతించని సమస్యను కూడా కంపెనీ పరిష్కరించింది. అప్‌డేట్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ నమోదు యొక్క పనితీరు, స్థిరత్వం మరియు విశ్వసనీయత మీద అనేక మెరుగుదలలు కూడా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్

ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ గూగుల్ పిక్సెల్ ఫోన్‌లలో సెకండరీ ప్రొఫైల్‌లలో కూడా NFC పేమెంట్ లకు మద్దతును జోడిస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ మరియు కెమెరా పరిష్కారాలను కూడా పొందుతుంది. పిక్సెల్ హ్యాండ్‌సెట్‌లలో ఆండ్రాయిడ్ 13తో టచ్ స్క్రీన్ పామ్ డిటెక్షన్ మరియు రెస్పాన్స్ మెరుగుపరచబడిందని కంపెనీ తెలిపింది. యూసర్ ఇంటర్‌ఫేస్‌లో ఫోన్ సెటప్ అనుభవంతో పాటు థర్డ్-పార్టీ లాంచర్‌లతో నావిగేషన్ మద్దతుపై గూగుల్ పని చేస్తుంది.

ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్

ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ "మెటీరియల్ యుపై రూపొందించే కొత్త రూపం మరియు శైలిని" తెస్తుందని గూగుల్ వెల్లడించింది. ఇది వాల్‌పేపర్‌తో థీమ్ మరియు కలర్ తో సరిపోలడానికి థర్డ్ పార్టీ యాప్‌లను అనుకూలీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో వ్యక్తిగత యాప్‌లకు నిర్దిష్ట భాషలను కేటాయించే సామర్థ్యాన్ని కూడా కంపెనీ జోడిస్తోంది. అంతేకాకుండా తాజా OS అప్‌డేట్‌లో సరికొత్త మీడియా ప్లేయర్ కూడా ఉంది. అది యూసర్ వింటున్న మ్యూజిక్ మరియు పాడ్‌కాస్ట్ రకం ఆధారంగా దాని "లుక్ అండ్ ఫీల్"ని మారుస్తుంది.

Android 13 బెడ్‌టైమ్ మోడ్

Android 13 బెడ్‌టైమ్ మోడ్

Android 13 బెడ్‌టైమ్ మోడ్ కోసం మరిన్ని అనుకూలీకరణ ఫీచర్‌లను అందిస్తుంది. అదనంగా ఇది యాప్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతించదలిచిన నిర్దిష్ట ఫోటోలను మరియు వీడియోలను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇప్పుడు కొత్త ఆండ్రాయిడ్ OS వెర్షన్‌తో నోటిఫికేషన్‌లను పంపడానికి యాప్‌లు యూజర్ యొక్క "స్పష్టమైన" అనుమతిని పొందవలసి ఉంటుంది. వినియోగదారులు తమ ఫోన్ నుండి వారి క్రోమ్ బుక్ కి మెసేజింగ్ యాప్‌ను త్వరలో ప్రతిబింబించగలరని కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 13కి బ్లూటూత్ లో ఎనర్జీ (LE) ఆడియో కూడా జోడించబడి మెరుగైన సమకాలీకరించబడిన ఆడియోను వినడానికి వినియోగదారుని అనుమతిస్తుంది.

కంటెంట్‌ కాపీ-పేస్ట్

కొత్త ఆండ్రాయిడ్ OS వెర్షన్ థర్డ్-పార్టీ కెమెరా యాప్‌ల కోసం HDR వీడియో సపోర్ట్‌ని అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో ఫోన్ నుండి టేబుల్‌కి కంటెంట్‌ని కాపీ-పేస్ట్ చేయగలుగుతారు. టాబ్లెట్‌ల కోసం ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ కొత్తగా అప్‌డేట్ చేయబడిన టాస్క్‌బార్‌ని తీసుకువస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్‌ని సులభతరం చేస్తుంది. ఈ అప్‌డేట్‌తో టాబ్లెట్‌లు ఇప్పుడు వినియోగదారు అరచేతి మరియు స్టైలస్ పెన్ నుండి స్పర్శలను విడివిడిగా నమోదు చేస్తాయి.

Best Mobiles in India

English summary
Google Rolls Out Android 13 New Update For Pixel Smartphones: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X