గూగుల్ బుక్‌మార్క్‌లు ఇక కనిపించవు!! ఎప్పటినుంచో తెలుసా...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజంగూగుల్ తన యొక్క వినియోగదారులకు దాదాపు 16 సంవత్సరాలుగా అందిస్తున్న గూగుల్ బుక్‌మార్క్‌ల సర్వీసుకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. అంటే ఈ యొక్క సర్వీసును సెప్టెంబర్ 30, 2021 న మూసివేస్తోంది. ఈ తేదీ తరువాత గూగుల్ బుక్‌మార్క్‌లు వినియోగదారులందరికీ మూసివేయబడతాయి. "సెప్టెంబర్ 30, 2021 తరువాత గూగుల్ బుక్‌మార్క్‌లు యూజర్లకు తమ యొక్క మద్దతును ఇవ్వవు" అని గూగుల్ బుక్‌మార్క్‌ల పేజీలో రన్ అవుతున్న ఒక బ్యానర్ పేర్కొంది. అప్పటి వరకు తమ బుక్‌మార్క్‌లను ఎగుమతి చేయడానికి కంపెనీ వినియోగదారులను అనుమతిస్తుంది. యూజర్లు google.com/bookmarks కు వెళ్లి వారి డేటా కాపీని పొందడానికి 'ఎక్సపోర్ట్ బుక్‌మార్క్‌' పై క్లిక్ చేయవచ్చు.

 

బుక్‌మార్క్‌లు

బుక్‌మార్క్‌లు చాలా ప్రజాదరణ పొందిన సర్వీస్ కాకపోవచ్చు. అయితే దాని మూసివేత గూగుల్ మ్యాప్‌లలోని 'స్టార్‌డ్' లొకేషన్ ఫీచర్ ను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ రెండిటిని సమకాలీకరించినట్లు సమాచారం. గూగుల్ బుక్‌మార్క్‌లను మూసివేయడం వల్ల వినియోగదారుల 'స్టార్‌డ్' లొకేషన్ కూడా తొలగించబడతాయి. అయితే దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కొన్ని వెబ్ సైట్ల సమాచారం ప్రకారం వినియోగదారులకు ఒక మార్గం ఉంది. గూగుల్ మ్యాప్స్ లో సేవ్ చేసిన జాబితాలో 'స్టార్‌డ్' జాబితా మాత్రమే బుక్‌మార్క్‌లకు సమకాలీకరిస్తుంది.

PCని ఉపయోగించి గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ ను సేవ్ చేసే విధానం

PCని ఉపయోగించి గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ ను సేవ్ చేసే విధానం

గూగుల్ మ్యాప్స్ యూజర్లు తమ అభిమాన ప్రదేశాలను జాబితాలో సులభంగా జోడించడానికి అనుమతిస్తుంది. సేవ్ చేయడం కోసం ఈ కింది పద్దతులను అనుసరించండి.

** మీదుగా గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి.

** బిజినెస్, ప్లేస్ లేదా అక్షాంశం మరియు రేఖాంశ కోఆర్డినేట్‌ల కోసం క్లిక్ చేయండి లేదా సెర్చ్ చేయండి.

** తరువాత సేవ్ చేసి ఆపై మీ జాబితాను ఎంచుకోండి.

** లొకేషన్ యొక్క జాబితాను స్వయంగా షేర్ చేయకపోతే సేవ్ చేసిన వినియోగదారులు మాత్రమే తమ ప్లేస్ లను కనుగొనగలరు. వినియోగదారుల సేవ్ చేసిన స్థలాల సమాచారాన్ని గూగుల్ లో పంచుకోవచ్చు.

 

మరొక వెబ్‌సైట్ నుండి ప్లేస్ ను సేవ్ చేసే విధానం
 

మరొక వెబ్‌సైట్ నుండి ప్లేస్ ను సేవ్ చేసే విధానం

వెబ్‌సైట్‌లో గూగుల్ మ్యాప్స్ నుండి పొందుపరిచిన మ్యాప్ ఉంటే మీరు ఆ ప్లేస్ ను మీ గూగుల్ మ్యాప్స్‌లో సేవ్ చేయవచ్చు.

** ఇందుకోసం గూగుల్ మ్యాప్స్ నుండి పొందుపరిచిన మ్యాప్‌తో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

** ప్లేస్ యొక్క సమాచారాన్ని పైకి లాగడానికి మ్యాప్‌లోని ప్లేస్ ను క్లిక్ చేయండి. ఇప్పుడు 'సేవ్' ఎంపిక మీద క్లిక్ చేసి ఆపై జాబితాను ఎంచుకోండి.

** మీ యొక్క స్టార్ మరియు వెబ్‌సైట్ పేరు మీ డెస్క్‌టాప్ మరియు మొబైల్ గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుంది.

గమనిక: మీరు ఏదైనా ఒక ప్లేస్ ను సేవ్ చేసినప్పుడు మీరు ఆఫ్‌లైన్ ప్రాంతాన్ని డౌన్‌లోడ్ చేసినా లేదా జోడించినా దానికి సమానం కాదు.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Google's 16 years Old Service Bookmarks Shutdown Very soon!! Save Places on Google Maps Using Pc and Another Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X