గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

Posted By:

సెర్చ్ ఇంజన్ గూగుల్ తన 16వ పుట్టిన రోజును శనివారం (సెప్టంబర్ 27)న ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన హోమ్ పేజీ పై ఆసక్తికర పుట్టినరోజు డూడుల్‌ను అప్‌లోడ్ చేసింది. 2005 వరకు గూగుల్ తన పుట్టినరోజును సెప్టంబర్ 7న జరుపుకునేది. న్యాయపరమైన కారణావల్ల ఆ తేదీని సెప్టంబర్ 27కు మార్చారు. సెర్చ్ ఇంజన్ గూగుల్ మరిన్ని పుట్టిరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. గూగుల్ 16వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని పలు ఆసక్తికర వాస్తవాలు మీకోసం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన సాధారణ ఇంటర్ ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలను లోడ్ చేస్తుంది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అవుట్ పుట్‌ను విడుదల చేస్తుంది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మైళ్ల రోడ్డు మార్గాన్ని ఫోటోల ద్వారా చిత్రీకరించింది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

2013కు గాను 91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం కేవలం ప్రకటనల ద్వారానే వచ్చింది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

మీరు గూగుల్ సెర్చ్ పేజీలో ఫేస్‌బుక్ అని టైప్ చేసినట్లయితే కొన్ని మిల్లీసెకన్ల వ్యవధిలోనే 5,300,000,000 ఫలితాలను గూగుల్ మీముందు ఉంచుతుంది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

సగటను ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు గూగుల్‌లో ప్రాసెస్ కాబడతాయి.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది. ఈ డేటాను నింపటానికి లక్ష వన్-టెరాబైట్ పర్సనల్ డ్రైవ్‌లు అవసరముతాయి.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ హోమ్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు  ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ'' ("I'm feeling lucky")

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

కంపెనీలో ఆ 16శాతం వాటా విలువ $46బిలియన్లు,

గూగుల్ 16వ పుట్టిన రోజు... ఆసక్తికర నిజాలు

గూగుల్‌‌లో కొత్తగా చేరిన ఉద్యోగిని "Noogler"గా, మాజీ ఉద్యోగిని ‘‘Xoogler''గా పిలుస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google's 16th birthday: Crazy-Interesting Facts About Google. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot