20 వసంతాల గూగుల్, చరిత్రను తిరగేస్తే...

గూగుల్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు . ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించి,కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందించి,కోటానుకోట్ల సెర్చ్ పేజీలు,లెక్క‌కు మించిన అప్లికేష‌న్లు,వంద‌ల కోట్ల సంఖ్య‌లో వినియో

|

గూగుల్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు . ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించి,కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందించి,కోటానుకోట్ల సెర్చ్ పేజీలు,లెక్క‌కు మించిన అప్లికేష‌న్లు,వంద‌ల కోట్ల సంఖ్య‌లో వినియోగ‌దారుల, ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్‌,ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంది.ఈ నేపథ్యం లో ఈ రోజుతో గూగుల్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 20 ఏళ్ళ గూగుల్ ప్రస్థానాన్ని డూడుల్ రూపంలో చూడండి....

 

గూగుల్ ఈ  పేరు ఎలా వచ్చిందంటే...

గూగుల్ ఈ పేరు ఎలా వచ్చిందంటే...

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య.కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ అని అంటారు.

గూగుల్ 1998లో ప్రారంభం అయింది...

గూగుల్ 1998లో ప్రారంభం అయింది...

సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ ప్రస్థానం 1998లో ప్రారంభం అయింది. 1998 లో లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ లు స్థాపించిన గూగుల్ నేడు సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

మొద‌ట్లో సెప్టెంబ‌ర్ 26, ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 7 జరిపేవారు...
 

మొద‌ట్లో సెప్టెంబ‌ర్ 26, ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 7 జరిపేవారు...

మొద‌ట్లో సెప్టెంబ‌ర్ 26, ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 7, సెప్టెంబ‌ర్ 8 తేదీల్లో జరిపేవారు. ఇక గూగుల్‌కు చెందిన వికీ పేజ్‌లో చూస్తే దాని వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సెప్టెంబ‌ర్ 4, 1998 అని ఉంటుంది. ఈ క్ర‌మంలో ఒక నిర్దిష్ట తేదీ నాడే గూగుల్ బ‌ర్త్ డే జ‌ర‌పాల‌ని ఆ కంపెనీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. దీంతో 2006 నుంచి సెప్టెంబ‌ర్ 27వ తేదీన గూగుల్ బ‌ర్త్ డేను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

జూలై 2001లో  గూగుల్...

జూలై 2001లో గూగుల్...

జూలై 2001లో గూగుల్ ఇమేజెస్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాదాపు 250 మిలియన్ల ఇమేజెస్ గూగుల్‌లో ఉన్నాయి. ఇదే అతి పెద్ద ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ వెబ్ డిసెంబర్ 2001 గూగుల్ మొదటి వార్షికొత్సవం జరిగింది.

2002 సంవ‌త్స‌రంలో...

2002 సంవ‌త్స‌రంలో...

2002 సంవత్సరంలో గూగుల్ కంపెనీని యాహూ కొనాల‌ని చూసింది. 3బిలియ‌న్ డాల‌ర్లు ఆఫ‌ర్ చేసింది. ఈ ఆఫ‌ర్‌ను గూగుల్ తిర‌స్క‌రించింది.

జూన్ 2013లో  లూన్ ప్రాజెక్టుని....

జూన్ 2013లో లూన్ ప్రాజెక్టుని....

జూన్ 2013లో లూన్ ప్రాజెక్టుని గూగుల్ చేప‌ట్టింది. అలాగే జులై 2013న మొబైల్ వినియోగ‌దారుల కోసం గూగుల్ మ్యాప్‌ను రిలీజ్ చేసింది.

జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను....

జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను....

జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను హిందీలో లాంచ్ చేసారు.అలాగే సెప్టెంబర్ 2014న ఆండ్రాయిడ్ వన్ ఇండియాలో ఆపరేటింగ్ సిస్టం ఇండియాలో లాంచ్ అయ్యింది. అక్టోబర్ 14న గూగుల్ వాయిస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంటాయి.

Best Mobiles in India

English summary
Google’s birthday Doodle celebrates 20 years of popular searches.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X