నా ఓటు ఆపిల్‌కే అంటున్న గూగుల్ సీఈఓ

Written By:

ఆపిల్ కంపెనీకి అలాగే ఎఫ్‌బిఐ అధికారులకు మధ్య జరుగుతున్న హ్యాకింగ్ సంగ్రామంపై గూగుల్ సీఈఓ తన మనసులోని గుట్టువిప్పారు. ఆపిల్ కంపెనీ ఉగ్రవాది ఫోన్ హ్యాక్ చేయనని చెప్పడంపై ఆయన సానుకూలతను వ్యక్తం చేశారు. ఆపిల్ మంచి పని చేసిందంటూ తన మద్ధతు ఆపిల్ కంపెనీకేనంటూ తెగేసి చెప్పారు. నేరాలు, ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని తమకు తెలుసని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read more: ఐఫోన్ హ్యాక్ కోసం కోర్టు ఆదేశాలు: సారీ అంటున్న టిమ్ కుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉగ్రవాది సయెద్ ఫరూఖ్‌ ఐఫోన్‌ యాక్సెస్‌ను

ఉగ్రవాది సయెద్ ఫరూఖ్‌ ఐఫోన్‌ యాక్సెస్‌ను ఎఫ్‌బీఐకి ఇవ్వడానికి ఆపిల్ నిరాకరించడాన్ని ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా గతంలో ఆపిల్‌ సీఈవో టిమ్ కూక్‌ ప్రచురించిన యాపిల్ ప్రైవసీ లేఖను సుందర్ పిచాయ్ ప్రస్తావించారు.

భవిష్యత్తులో అసాధారణ సమస్యాత్మక పరిస్థితులకు

ఉగ్రవాది ఐఫోన్‌ యాక్సెస్ ఇవ్వాలంటూ అమెరికా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భవిష్యత్తులో అసాధారణ సమస్యాత్మక పరిస్థితులకు దారితీయవచ్చునని పిచాయ్ అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచే ఎన్‌క్రిప్షన్ రక్షణ చర్యలు

వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచే ఎన్‌క్రిప్షన్ రక్షణ చర్యలు ఐఫోన్‌ మాదిరిగా ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను పర్యవేక్షించే గూగుల్‌ సంస్థ కూడా ఈ చర్చలోకి ప్రవేశించడం చాలా కీలకంగా మారింది.

మొబైల్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని

మొబైల్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచాల్సిందేనన్న ఆపిల్ నిర్ణయానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ మద్దతు పలికారు.

'మీ సమాచారానికి పూర్తి భద్రత కలిగించే ఉత్పత్తులను

'మీ సమాచారానికి పూర్తి భద్రత కలిగించే ఉత్పత్తులను మేం రూపొందిస్తున్నాం. అయితే ఈ విషయంలో చట్టబద్ధమైన ఆదేశాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఈ డాటా యాక్సెస్‌ను ఇస్తాం' అని మొదట ట్వీట్ చేసిన పిచాయ్‌ ఆ వెంటనే 'అయితే వినియోగదారుడి పరికరాన్ని హ్యాక్ చేసి.. అందులోని సమాచారాన్ని ఇవ్వమనడం మాత్రం అందుకు పూర్తి విరుద్ధమే' అని మరో ట్వీట్ లో తేల్చిచెప్పారు.

హ్యాకింగ్‌ చేయాలంటూ కంపెనీలను బలవంత పెట్టడం

హ్యాకింగ్‌ చేయాలంటూ కంపెనీలను బలవంత పెట్టడం వినియోగదారుల ప్రైవసీ విషయంలో రాజీపడటమే అవుతుందని, ఈ కీలక విషయంలో బహిరంగ చర్చ జరగాల్సి ఉందని పిచాయ్ స్పష్టం చేశారు.

ఇది భవిష్యత్తులో సమస్యలకు

ఇది భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఈ విషయంలో చట్టబద్దమైన ఆదేశాలు ఉంటే దర్యాఫ్తు సంస్థలకు ఈ డాటా యాక్సెస్ ఇస్తామని ట్వీట్ చేశారు. అయితే, హ్యాక్ చేసి సమాచారం ఇవ్వమనడం సరికాదన్నారు.

మరోవైపు విజిల్ బ్లోయర్‌ ఎడ్వర్డ్ స్నోడన్ కూడా

మరోవైపు విజిల్ బ్లోయర్‌ ఎడ్వర్డ్ స్నోడన్ కూడా ఆపిల్ సంస్థకు మద్దతు పలికారు. పౌరుల వ్యక్తిగత విషయాల్లోకి చొరబడేవిధంగా ఉన్న ఎఫ్‌బీఐ తీరును వ్యతిరేకిస్తున్న ఆపిల్‌ ను ఆయన కొనియాడారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wtite Google’s CEO just sided with Apple in the encryption debate
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot