ప్రభంజనం సృష్టిస్తున్న గూగుల్ యూట్యూబ్ వీడియో!

Posted By:

‘రీయూనియన్' శీర్షికతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఇటీవల యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రకటన ఇప్పటికే లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. ఇప్పటికి వరకు ఈ యూట్యూబ్ వీడియోకు 725,821 వీక్షణలు లభించాయి.

యూట్యూబ్‌లో ఇండియా - పాకిస్థాన్ మ్యాటర్!

గూగుల్ తమ మార్కెటింగ్ వ్యూహరచనలో భాగంగా , 1947 ఇండియా - పాకిస్థాన్ విభజనలో విడిపోయిన ఇద్దరు మిత్రులు మళ్లి ఏలా కలుసుకున్నారు అనే అంశం పై కంటతడిపెట్ట్లించే యాడ్‌ను రూపొందించింది. ప్రకటన వివరాల్లోకి వెళితే... వయసు  పైబడిన వ్యక్తి మిస్టర్ మెహ్రా తన మనవరాలు సుమన్‌తో పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటారు. ఈ క్రమంలో మెహ్రా తన చిన్ననాటి మిత్రుడు యూసఫ్ గురించి సుమన్‌కు వివరించటం ప్రారంభిస్తారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తాము మంచి మిత్రులమని అయితే 1947 ఇండియా - పాకిస్థాన్ విభజనలో విడిపోవల్సి వచ్చిందని మెహ్రా భావోద్వేగానిక లోనవతారు. తాతగారి కథను విన్న సుమ గూగుల్ సెర్చ్ సాయంతో పాకిస్థాన్‌లో ఉంటున్న యూసఫ్ ఆచూకీని కొనుగొని భారత్‌కు ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలో 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెహ్రాను యూసఫ్ ఆశ్చర్యపరిచే రీతిలో కలుసుకుంటాడు. దీంతో వారి ఆనందాలకు ఆవథులు ఉండవు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/gHGDN9-oFJE?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot