లంకలో గూగుల్ బెలూన్ కూలిందా.. దిగిందా..?

Written By:

శ్రీలంకలో ఇంటర్నెట్ సేవల నిమిత్తం గూగుల్ సంస్థ ప్రారంభించిన ప్రాజెక్ట్ లూన్ లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బెలూన్ తేయాకు తోటల్లో కూలిపోయింది.ఇది కూలిపోవడాన్ని అదీగాక భారీ స్థాయిలో ఉండటం వల్ల స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారమందించారు.

Read more : భారత్‌లో టవర్లు లేకుండా 4జీ ఇంటర్నెట్..?

లంకలో గూగుల్ బెలూన్ కూలిందా.. దిగిందా..?

గంపాలా ప్రాంతంలో తేయాకు తోటల్లో కూలిపోయిన బెలూన్ స్థానికులు గుర్తించారని చెప్పారు.ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారని ఏఎప్ఫీ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఇది కూలిపోలేదని శ్రీలంక సమాచార,సాంకేతిక శాఖ ప్రకటించింది.

Read more: సీక్రెట్‌ విప్లవంతో దడ పుట్టిస్తున్న గూగుల్

లంకలో గూగుల్ బెలూన్ కూలిందా.. దిగిందా..?

ఈ బెలూన్ నిర్దేశిత సమయానికి కిందికి దిగిందని వారు పేర్కొన్నారు. ఇంటర్నెట్ స్పీడును బెలూన్ల ద్వారా విస్తరించేందుకు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు 'ప్రాజెక్ట్ లూన్'ను గూగుల్ చేపట్టింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తోంది.

లంకలో గూగుల్ బెలూన్ కూలిందా.. దిగిందా..?

ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.ఈ సంధర్భంగా గూగుల్ రహస్య ప్రాజెక్టులను ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్ ఒకటి. గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి.

ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి

ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులు ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా అందుతున్నాయి.

గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్

గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్ తయారీ పై దృష్టిసారించింది. ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనున్నాయి. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది.

 

 

ఈ వెబ్ ఆధారిత వర్చువల్ కమ్యూనిటీ స్పేస్ ప్రాజెక్ట్‌లో

ఈ వెబ్ ఆధారిత వర్చువల్ కమ్యూనిటీ స్పేస్ ప్రాజెక్ట్‌లో భాగంగా యూజర్లు చాటింగ్‌లో భాగంగా తమ ఆన్‌లైన్ హ్యాంగవుట్ స్పేస్‌ను తమకు నచ్చినట్లు పర్సనలైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సెక్సెస్ అనంతరం గూగుల్ ఈ ప్రాజెక్టును 2008లో నిలిపివేసింది.

 

 

గూగుల్ ఎర్త్'

గూగుల్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తులలో 'గూగుల్ ఎర్త్' ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబ్‌లో మనకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని మౌస్‌తో జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశానికి సంబంధించి పరిసర ప్రాంతాలు, రోడ్లు, భవనాలు శాటిలైట్ చిత్రం రూపంలో మనకు కనిపిస్తాయి. ఉపగ్రహ 3డి కోణంతో భూమిపై ఉన్న ప్రకృతిని మెరుగైన చిత్రాలుగా వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుంది.

గూగుల్ ‘ప్రాజెక్ట్ అరా' పేరుతో

గూగుల్ ‘ప్రాజెక్ట్ అరా' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వ్యవస్థను వృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థలో భాగంగా యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లను తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ వర్షన్‌లో వీటిని గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది.

రోగాలను కనిపెట్లే ఓ మాత్రను

రోగాలను కనిపెట్లే ఓ మాత్రను తాము అభివృద్థి చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపాన్ని అద్దుకున్నట్లయితే ప్రమాదకర వ్యాధులను ముందుగానే పసిగట్టవచ్చు.

 

 

ఫ్లైయింగ్ విండ్ టర్బైన్స్

ఈ ప్రాజెక్టును గూగుల్ 2013లోనే సొంతం చేసుకుంది. ఎయిర్‌బోర్న్ టర్బైన్‌ల ఆధారంగా తక్కువ ఖర్చులో శక్తిని సృష్టించటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

 

 

గూగుల్+ పేరుతో

గూగుల్+ పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ 2011లో ఆవిష్కరించింది. ఈ సామాజిక సంబంధాల వేదికకు ప్రస్తుతం 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

 

 

గూగుల్ బుక్స్

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ మిలియన్ల కొద్ది పుస్తకాలను డిజిటలైజ్ చేయనుంది. 2004లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google's internet balloon 'crashes' in Sri Lanka test flight
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot