గూగుల్ ‘Try Now’, ఏంటీ కొత్త ఫీచర్?
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ప్లే స్టోర్‌లో భారీ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా 'Try Now’ బటన్‌ను గూగుల్ తన ప్లే స్టోర్‌లో యాడ్ చేసింది. ఈ సదుపాయంతో ప్లే స్టోర్‌లోని యాప్‌లను ముందుగా ట్రై చేసి ఆ తరువాత ఇన్‌స్టాల్ చేసుకునే వీలుంటుంది.

ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ టెక్నాలజీ పై గూగుల్ బిల్ట్ చేసింది. ఈ టెక్నాలజీని 2016 గూగుల్ I/O డెవలపర్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ మొదటిసారిగా పరిచయం చేసింది. అనేక టెస్టింగ్స్ అలానే అప్‌డేట్స్ అనంతరం ఈ సర్వీసును జూన్‌లో నిర్వహించిన గూగుల్ I/O 2017 డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ అఫీషియల్‌గా లాంచ్ చేసింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్తగా యాడ్ అయిన "Try Now" బటన్ పై ప్రెస్ చేయటం ద్వారా, ఆ ఫీచర్ పరిధిలోని యాప్స్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాయిలో మీకు నచ్చిన యాప్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ముందుగా ఆ యాప్ లేదా దానికి సంబంధించిన భాగాలు ఇన్‌స్టెంట్‌గా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో లాంచ్ అవసేతాచి. లాంచ్ అయిన యాప్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన తరువాత, ఆ యాప్ మీకు నచ్చినట్లయితే పూర్తిస్థాయిలో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఇలా చేయటం వల్ల తరచూ మొబైల్ డేటాతో పాటు ఫోన్ మెమురీ కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం గూగుల్ ప్లే స్టోర్‌లో విస్తృతంగా అందుబాటులో లేనప్పటికి ఈ Link పై క్లిక్ చేయటం ద్వారా Try Now ఫీచర్ పరిధిలోకి వచ్చే యాప్స్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ అంటే ఏంటి..?
ఇంతకాలం ఆండ్రాయిడ్ యూజర్లు ఏదైనా యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవల్సి వచ్చేది. ఇక పై అలా చేయకుండా ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీస్‌ను మీ ఫోన్‌లో ఎనేబుల్ చేసుకున్నట్లయితే సంబంధిత యాప్స్ నేరుగా గూగుల్ సర్వర్ నుంచే మీ డివైస్‌లో రన్ అవుతాయి. దీంతో ప్రతి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన అవసరం ఉండదు. ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ పై కూడా పెద్దగా ప్రభావం ఉండదు.
ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీసును ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎలా..?
ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Google ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అకౌంట్స్, సర్వీసెస్ పేరుతో రెండు విభాగాలు కనిపిస్తాయి. వాటిలో సర్వీసెస్ విభాగంలో కనిపించే Instant Apps ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సర్వీసును ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీసు మీ ఫోన్‌లో ఎనేబుల్ కాబడుతుంది.
ఆ తరువాత నుంచి ఇన్‌స్టెంట్ యాప్స్ రూపంలో లభించే ఏ యాప్‌ను అయినా మీరు పొందే వీలుంటుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఈ యాప్‌లను పొందే వీలుంటుంది. మీకు కావల్సిన యాప్ పేరును గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే సెర్చ్ ఫలితాల్లో ఆ యాప్‌కు సంబంధించిన Instant App కనిపిస్తుంది. ఆ యాప్‌ను ఎంచుకున్నట్లయితే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వాల్సిన పనిలేకుండా నేరుగా సర్వర్ నుంచే రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








