నిలిపివేయబడిన గూగుల్ ఉత్పత్తుల వివరాలు!

Posted By:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన ఉచిత రీడర్ సర్వీసు అయిన ‘గూగుల్ రీడర్'ను సోమవారం మూసివేసింది. ఈ నేపధ్యంలో పలువురు ప్రత్యామ్నాయ మార్గాలుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు అయిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్‌లను ఆశ్రయిస్తున్నారు. గూగుల్ రీడర్‌ను కొసాగించాలని కోరుతూ change.org చేపట్టిన ‘కీప్ గూగుల్ రీడర్ రన్నింగ్' సంతకాల కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కు 154,000 సంతకాలు అందాయి. ఈ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న మరో పిటీషన్ ‘డోంట్ కిల్ గూగుల్ రీడర్' కార్యక్రమానికి 7,598 మంది మద్దతు పలికారు. గూగుల్ రీడర్ మూతబడటంతో ఫీడ్లీ, డిగ్ రీడర్, న్యూస్ బ్లర్, ఫ్లిప్‌బోర్డ్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు పుంజుకుంటున్నాయి. 2005 అక్టోబర్‌లో ప్రారంభించబడిన గూగుల్ రీడర్‌కు కొద్ది కాలంలోనే మిలియన్ల సంఖ్యలో ప్రజానీకం చేరువయ్యారు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇప్పటి వరకు నిలిపివేయబడిన గూగుల్ ఉత్పత్తుల వివరాలను ఫోటో స్లైడ్ షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిలిపివేయబడిన గూగుల్ ఉత్పత్తుల వివరాలు!

1.) గూగుల్ జవాబులు (Google Answers)

గూగుల్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు తెలియని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను ఉచితంగా పొందవచ్చు. ఈ టూల్‌ను డిసెంబర్ 2006లో మూసివేయటం జరిగింది.

 

గూగుల్ జియిట్జిస్ట్ (Google Zeitgeist)

2.) గూగుల్ జియిట్జిస్ట్ (Google Zeitgeist)

ఈ టూల్ పాపులర్ సెర్చ్ ఎంక్వైరీల జాబితాలును దేశాలు వారిగా కలిగి ఉండేది. మే 2007లో మూసివేసారు.

 

గూగుల్ పేజ్ క్రియేటర్ (Google page creator)

3.) గూగుల్ పేజ్ క్రియేటర్ (Google page creator):

ఈ టూల్‌ హెచ్‌టిఎమ్‌ఎల్ విజ్ఞానాన్ని పెంపొందించేది. ఈ సర్వీసును గూగుల్ 2008లో నిలిపివేయటం జరిగింది.

 

గూగుల్ లైవ్లీ (Google lively)

4.) గూగుల్ లైవ్లీ (Google lively):

ఈ 3డీ పెయింటెడ్ చాట్ ప్రోగ్రామ్ విండోస్ వర్షన్‌ను మాత్రమే సపోర్ట్ చేసేది. ఈ ఫీచర్ జీవితకాలం కేవలం 6 నెలలు మాత్రమే. డిసెంబర్ 2008లో మూసివేయటం జరిగింది.

 

గూగుల్ జైకు (GOOGLE jaiku)

5.) గూగుల్ జైకు (GOOGLE jaiku):

ఈ మైక్రోబ్లాగింగ్ సర్వీసును గూగుల్ 2009లో మూసివేసింది.

 

గూగుల్ డాడ్జ్ బాల్(GOOGLE Dodgeball)

6.) గూగుల్ డాడ్జ్ బాల్(GOOGLE Dodgeball):

ఈ మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీసును గూగుల్ 2005లో ప్రారంభించింది. అనూహ్యంగా చోటచేసుకున్న పరిణామాలతో ఈ ఫీచర్‌ను గూగుల్ 2009లో రద్దు చేయటం జరిగింది.

 

గూగుల్ సెర్చ్ వికీ (GOOGLE Search Wiki)

గూగుల్ సెర్చ్ వికీ (GOOGLE Search Wiki):

ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా యూజర్లు తమ సెర్చ్ రిజల్ట్‌లను రీ-ఆర్డర్‌లో చూసుకోవచ్చు. మార్చి 2010లో ఈ ఫీచర్‌ను మూసివేయటం జరిగింది.

 

గూగుల్ వేవ్ (GOOGLE Wave)

గూగుల్ వేవ్ (GOOGLE Wave):

ఈ ఫీచర్‌కు సంబంధించి ప్రివ్యూను మాత్రమే గూగుల్ విడుదల చేయటం జరిగింది. ఈ రియల్ టైమ్ ఎడిటింగ్ ఫీచర్ అభివృద్ధికి సంబంధించిన పనులను ఆసక్తికొరవడటంతో గూగుల్ 2010లో నిలిపివేయటం జరిగింది.

 

గూగుల్ ల్యాబ్స్ (GOOGLE Labs)

9.) గూగుల్ ల్యాబ్స్ (GOOGLE Labs):

ఈ ప్రత్యేకమైన టూల్ ద్వారా యూజర్లు తమ ప్రోటోటైప్ ప్రాజెక్టులను పరీక్షించుకోవచ్చు. ఈ టూల్‌ను జూలై 2011లో మూసివేయటం జరిగింది.

 

గూగుల్ నోట్‌బుక్ (GOOGLE Notebook)

10.) గూగుల్ నోట్‌బుక్ (GOOGLE Notebook):

ఈ ఉచిత అప్లికేషన్ ద్వారా యూజర్ డేటాను ఆన్‌లైన్ నోట్‌బుక్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ సేవలను గూగుల్ సెప్టంబర్ 2011లో నిలిపివేయటం జరిగింది. ఇదే తరహా అప్లికేషన్‌ను గూగుల్ గూగుల్ కీప్ పేరుతో మార్చి 2013లో విడుదల చేసింది.

 

గూగుల్ సైడ్ వికీ (GOOGLE Sidewiki)

గూగుల్ సైడ్ వికీ (GOOGLE Sidewiki):

ఈ సైడ్ బార్ టూల్ ద్వారా యూజర్ అదనపు సమాచారాన్ని వెబ్ పేజీలోకి జోడించవచ్చు. ఈ ఫీచర్‌ను గూగుల్ సెప్టంబర్ 2011లో మూసివేయటం జరిగింది.

 

గూగుల్ ఆర్డ్‌వార్క్(GOOGLE Aardvark)

గూగుల్ ఆర్డ్‌వార్క్(GOOGLE Aardvark):

ఈ సోషల్ సెర్చ్ సర్వీస్ ప్రశ్నలు ఇంకా సమాధానాలకు సంబంధించిన లైవ్‌చాట్‌ను నిర్వహిస్తుంది. ఈ సర్వీసును గూగుల్ సెప్టంబర్ 2011లో నిలిపివేయటం జరిగింది.

 

గూగుల్ బజ్ (GOOGLE Buzz)

గూగుల్ బజ్ (GOOGLE Buzz):

ఈ సోషల్ నెట్‌వర్కింగ్, మైక్రోబ్లాగింగ్ ఇంకా మెసేజింగ్ టూల్‌ను గూగుల్ జీమెయిల్‌తో ఐక్యం చేయటం జరిగింది. అయితే, అనేక సమస్యల రిత్యా డిసెంబర్ 15, 2011న ఈ సర్వీసును గూగుల్ రద్దు చేయటం జరిగింది.

 

గూగుల్ పిక్నిక్ (GOOGLE Picnic)

గూగుల్ పిక్నిక్ (GOOGLE Picnic):

ఈ ఆన్‌లైన్ ఫోటో ఎడిటర్ టూల్‌ను ఏప్రిల్ 19,2012న గూగుల్ నిలిపివేయటం జరిగింది.

 

గూగుల్ క్నోల్ (GOOGLE Knol)

గూగుల్ క్నోల్ (GOOGLE Knol):

వికిపీడియాకు పోటీగా ప్రారంభించిన ఈ ఫీచర్ అక్టోబర్1, 2012 తరువాత కనుమరుగైపోయింది.

 

గూగుల్ హెల్త్ (GOOGLE Health)

గూగుల్ హెల్త్ (GOOGLE Health):

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఆరోగ్య సంబంధిత సమచారాన్ని షేర్ లేదా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను జూన్ 24, 2011 నుంచి గూగుల్ నిలిపివేసింది.

 

గూగుల్ టాక్ (GOOGLE Talk)

గూగుల్ టాక్ (GOOGLE Talk):

ఈ త్వరిత మెసేజింగ్ సర్వీస్ ద్వారా టెక్స్ట్ ఇంకా వాయిస్ కమ్యూనికేషన్‌లను నిర్విహించుకోవచ్చు. ఈ సర్వీసును మే 15, 2013న గూగుల్ హ్యాంగ్ అవట్స్ ఫీచర్ తో రీప్లేస్ చేయటం జరిగింది.

 

ఐగూగుల్ (iGOOGLE)

ఐగూగుల్ (iGOOGLE):

ఈ కస్టమైజబుల్ హోమ్ పేజ్ ఫీచర్‌ను మే 2005లో ప్రారంభించటం జరిగింది. నవంబర్ 1, 2013న ఈ సర్వీసు రిటైర్ కానుంది.

 

గూగుల్ రీడర్ (GOOGLE Reader)

గూగుల్ రీడర్ (GOOGLE Reader):

గూగుల్ రీడర్ సర్వీసును అక్టోబర్ 7, 2005న ప్రారంభించటం జరిగింది. ఈ కంటెంట్ అప్లికేషన్‌ను గూగుల్ డిజైనర్ క్రిస్ వెతరిల్ 2005లో తయారు చేసారు. మార్చి 13, 2013న గూగుల్ రీడర్ సర్వీస్‌ను జూలై 1 నుంచి నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ వార్త గూగుల్ అభిమానులను తీవ్ర నిరాశకు లోనుచేసింది. జూలై 1, గూగుల్ రీడర్ సర్వీసును నిలిపివేస్తూ గుగూల్ చర్యలు తీసకుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot