Home
News

గూగుల్‌ జెమిని యాప్‌.. త్వరలో స్మార్ట్‌ఫోన్లకు మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సౌకర్యాలు..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత గూగుల్‌ జెమిని యాప్‌ ను (Google Gemini App) సంస్థ ఫిబ్రవరి 8న లాంచ్‌ చేసింది. ప్రస్తుతానికి ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మరియు కేవలం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ యాప్‌ ఆసియా ఫసిఫిక్, నార్త్‌ అమెరికా, లాటిన్ అమెరికా మరియు సౌత్రాఫికాలో ఈ వారంలో లాంచ్‌ కానుంది. ఈ యాప్‌ సపోర్టును హెడ్‌ఫోన్స్‌ను విస్తరించేందుకు సంస్థ కృషిచేస్తోంది.

యూజర్లు జెమిని యాప్‌ను డిఫార్ట్ అసిస్టెంట్‌గా తమ ఫోన్లలో మార్పులు చేసినా.. హెడ్‌ఫోన్‌ లేదా ఇయర్‌ఫోన్ల ద్వారా గూగుల్‌ అసిస్టెంట్‌ను యాక్టివేట్‌ చేయడం వీలుపడడం లేదు. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేయబడిన పరికరాలు AI యాప్‌కు సపోర్టు చేయనుందున ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీంతో గూగుల్‌ సంస్థ త్వరలో హెడ్‌ఫోన్లకు గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్టును విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Google said that working on gemini AI chatbot accessible to headphones

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ నివేదిక ప్రకారం (Google Artificial intelligence) గూగుల్‌ యాప్ బీటా వెర్షన్‌ (15.6) బిస్టో ఫామ్‌ Error మెసెజ్‌ను కనుగొంది. 2017లో తొలిసారిగా గూగుల్ బిస్టో (Bisto) అనే పదాన్ని వినియోగించింది. ఈ పదం గూగుల్‌ అసిస్టెంట్‌ ను రన్‌ చేసే హెడ్‌ఫోన్‌ తరగతికి చెందినది.

ఈ మెసేజ్‌ ద్వారా గూగుల్‌ జెమిని యాప్‌ తన సపోర్టును హెడ్‌ఫోన్లకు విస్తరించేందుకు పనిచేస్తోందని తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తే జెమిని యాప్‌ యొక్క జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఆడియో మీడియానికి అందుబాటులోకి వస్తాయి. దీంతోపాటు iOS పైన కూడా గూగుల్‌ పనిచేస్తుంది. అయితే ఎప్పటికి ఇది అందుబాటులోకి వస్తుందనే వివరాలు తెలియలేదు.

Google said that working on gemini AI chatbot accessible to headphones

జెమిని యాప్‌ కోసం పనిచేస్తున్న కీలక అధికారుల్లో ఒకరైన జాక్‌ క్రావ్‌జిక్‌ కీలక సమాచారం అందించారు. ఈ యాప్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో ఆసియా పసిఫిక్‌, లాటిన్‌ అమెరికా, నార్త్‌ అమెరికా మరియు ఆఫ్రికాలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే భారత్‌లోనూ ఫిబ్రవరి 12న లాంచ్‌ చేసినట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు యాప్‌ అందుబాటులోకి రాలేదు.

*గూగుల్‌ తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ బార్డ్‌ను జెమినిగా మార్చుతున్నట్లు ఇటీవల తెలిపింది. గూగుల్‌ అసిస్టెంట్‌ను తరహా లోనే జెమిని చాట్‌బాట్‌ను కూడా ఫోన్‌ డిఫాల్ట్‌ అసిస్టెంట్‌గా ఎంచుకోవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లో ఓకే గూగుల్ అని వాయిస్‌ కమాండ్‌ ఇవ్వడం ద్వారా AI అసిస్టెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల స్క్రీన్‌పైన ఓవర్‌ లే గా పనిచేస్తుంది.

గూగుల్‌ కొత్త జెమిని లాంగ్వేజ్‌ మోడల్‌ జెమిని చాట్‌బాట్‌ మూడు వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. జెమిని నానో - ఇది జెమిని చిన్న లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. దీని స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించుకోవచ్చు. జెమినీ ప్రో - ఇది జెమిని AI చాట్‌బాట్‌ ఉచిత వెర్షన్‌గా ఉంది. మరియు లార్జ్‌, అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది.

జెమిని అల్ట్రా : ఇది గూగుల్‌ బార్డ్‌ అధిక శక్తివంతమైన లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. ఇది జెమిని అడ్వాన్స్‌డ్‌ AI చాట్‌బాట్‌గా ఉంది. ప్రస్తుతానికి గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ మోడల్‌కు అల్ట్రా 1.0 యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు గూగుల్‌ అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది.

గూగుల్‌ జెమిని త్వరలో ఆండ్రాయిడ్‌, iOS ఫోన్లలో యాప్‌ల రూపంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇతర సంస్థల ఏఐ బాట్‌లతో పోలిస్తే గూగుల్‌ జెమిని భిన్నమైనదని సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. కేవలం టెక్స్ట్‌ మాత్రమే కాకుండా ఫోటోలు, ఆడియా, వీడియో, కోడ్‌ అన్ని విధాల ఫార్మాట్‌లలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గూగుల్‌ జెమినికి వాయిస్‌, ఫోటో, టెస్ట్స్‌ రూపంలో ఇన్‌పుట్‌ ఇచ్చినా వెంటనే స్పందిస్తుందన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google is working on Gemini AI Chatbot access to headphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X