జీఓఎస్ఎఫ్ 2014.. బిగ్ సక్సెస్

Posted By:

జోరుగా..హుషారుగా గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్

గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్ 2014)కు దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. చిన్న నగరాలైన గుంటూరు, రాంచీ, హుబ్లీ వంటి చిన్న నగరాల నుంచి వినియోగదారులు మొబైల్ ఫోన్‌ల ద్వారా జోరుగా ఆన్‌లైన్ షాపింగ్‌లో పాల్గొన్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ ఈ-కామర్స్ విభాగపు డైరెక్టర్ నితిన్ బవనకులే తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బుధవారం ప్రారంభమై శుక్రవారంతో ముగిసిన ఈ మూడు రోజుల ఆన్‌లైన్ షాపింగ్‌కు 80 లక్షల హిట్స్ లభించాయని, ప్రమోషన్ పిరియడ్‌తో కూడా కలుపుకుంటే మొత్తం 1.4 కోట్ల హిట్స్ లభించాయని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా 40 శాతం మంది మొబైల్ ఫోన్‌ల ద్వారా షాపింగ్ చేసారని, తొలిసారిగా పాల్గొన్న చాలా మంది రూ.299 కార్నర్‌లో షాపింగ్ చేసారని గూగుల్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 220 నగరాల నుంచి ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారని ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్, కిచెన్ వేర్ పరికరాలు అధికంగా అమ్ముడయ్యాయని గూగుల్ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Says GOSF 2014 Is a Success. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot