ఈ రోజు నుండి హ్యాపీ హాలీడేస్: గూగుల్

Posted By:

ఈ రోజు నుండి హ్యాపీ హాలీడేస్: గూగుల్

 

డిసెంబర్ వచ్చిందంటే చాలు.. క్రిస్ మస్, న్యూ ఇయర్ అంటూ సెలవులు. ఐతే ఈ సెలవలను దృష్టిలో పెట్టుకోని సెర్చ్ ఇంజన్ గూగుల్ తమ యొక్క సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తెందుకు గాను ఈ రోజు ప్రత్యేకంగా 'ఈ రోజు నుండి హ్యాపీ హాలీడేస్' అంటూ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్‌ని ఏర్పాటు చేసింది. ఈ రోజు(డిసెంబర్ 23) సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ హోం పేజిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ గూగుల్ డూడుల్ సందర్శకులను అందరికి ఆశ్చర్యాన్ని కలగజేసింది.

ప్రతి సంవత్సరం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ డిసెంబర్ మాసంలో హాలీడే సీజన్‌ని దృష్టిలో పెట్టుకోని గూగుల్ డూడుల్‌ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గూగుల్ ఏర్పాటు చేసిన ఈ 'హ్యాపీ హాలీడే ధీమ్' లో డిసెంబర్, జనవరిలో వచ్చే స్పెషల్ సెలవులను ప్రతిబంబిస్తూ రూపొందించడం జరిగింది. డిసెంబర్ మాసంలో వచ్చే జింగిల్ బెల్స్, స్నో మ్యాన్, క్రిస్ మస్ లాంటి పండుగలను ఈరోజు గూగుల్ డూడుల్‌లో ప్రతిబంబిస్తున్నాయి.

ఈరోజు గూగుల్ రూపొందించిన గూగుల్ డూడుల్‌లో వరుసగా 'వింటర్, క్రిస్ మస్, జింగిల్ బెల్స్, స్నో మ్యాన్, న్యూ ఇయర్, క్రిస్ మస్ గిప్ట్స్‌'ని ప్రతిబంబిస్తున్నాయి. గూగుల్ డూడుల్ సెలవులు ఈ క్రింది విధంగా రానున్నాయి..

* Chritmas

* New Year’s Day

* Eid ul-Fitr

* Chinese New Year

* Hanukkah

* Thanksgiving (US)

ఈ సంవత్సరం క్రిస్‌మస్‌ని అందరూ బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఈ గూగుల్ డూడుల్‌కి సంబంధించిన సమాచారాన్ని మీ సన్నిహితులు, స్నేహితులతో పాటు, ఫ్యామిలీతో ఆనందంగా పంచుకోండి. తెలుగు గిజ్‌బాట్ పాఠకుల అందరికీ క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియిజేస్తున్నాం...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot