Googleలో 2023లో ఎక్కువ మంది ఏం వెతికారో తెలుసా?
Google అందుబాటులోకి వచ్చాక మనకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. అయితే కొన్ని రోజుల్లో ఈ సంవత్సరం పూర్తికానుంది. అయితే ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువ మంది దేనికోసం వెతికారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలను గూగుల్ అందించింది. పూర్తి వివరాలు మీకోసం.
ప్రతి సంవత్సరం చివరలో.. ఏడాదిలో ఎక్కువ మంది శోధించిన వివరాలను గూగుల్ (Google search 2023) అందిస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎక్కువ మంది యూజర్లు వెతికిన ప్రాంతాలు, వ్యక్తులు, వివిధ సంస్థల, రోజుల ప్రత్యేకతలు వంటివి ఉన్నాయి. 2023 సంవత్సరంలో ఎక్కువ మంది యూజర్లు చంద్రయాన్- 3 గురించి తెలుసుకొనేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు.

2023లో గూగుల్‌లో ఎక్కువ మంది యూజర్లు శోధించిన జాబితా :
1 . చంద్రయాన్-3
2 . కర్ణాటక ఎన్నికల ఫలితాలు
3 . ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్తలు
4 . సతీష్ కౌశిక్
5 . బడ్జెట్ 2023
6 . టర్కీ భూకంపం
7 . అతిక్ అహ్మత్
8 . మాథ్యూ పెర్రీ
9 . మణిపూర్ వార్తలు
10 . ఒడిశా రైలు ప్రమాదం
గూగుల్‌లో 2023 సంవత్సరంలో ఎక్కువ మంది వెతికిన వ్యక్తులు :
1 . కియారా అద్వానీ
2 . శుభమాన్ గిల్
3 . రచిన్ రవీంద్ర
4 . మహ్మద్ షమీ
5 . ఎల్విష్ యాదవ్
6 . సిద్ధార్థ్ మల్హోత్రా
7 . గ్లెన్ మాక్స్‌వెల్
8 . డేవిడ్ బెక్హాం
9 . సూర్యకుమార్ యాదవ్
10 . ట్రావిస్ హెడ్

గూగుల్‌లో 2023లో వెతికిన పర్యాటక ప్రదేశాలు :
1 . వియత్నం
2 . గోవా
3 . బాలి
4 . శ్రీలంక
5 . థాయిలాండ్
6 . కశ్మీర్
7 . అండమాన్ మరియు నికోబార్ దీవులు
8 . ఇటలీ
9 . స్విట్జర్లాండ్
గూగుల్‌లో 2023లో ఎక్కువగా వెతికిన అంశాలు :
1 . G20 అంటే ఏమిటీ?
2 . UCC అంటే ఏమిటీ?
3 . ChatGPT అంటే ఏమిటీ?
4 . హమాస్ అంటే ఏమిటీ?
5 . చంద్రయాన్-3
6 . ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్
7 . క్రికెట్‌లో టైమ్ అవుట్ అంటే ఏమిటీ?
8 . IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటీ?
9 . సెంగోల్ అంటే ఏమిటీ?
దీంతోపాటు మరిన్ని విషయాలపై ఆరా తీశారు :
1 . యూట్యూబ్‌లో 5 వేల మంది సబ్‌స్కైబర్‌లను పొందడం ఎలా?
2 . కబడ్డీలో రాణించడం ఎలా
3 . కారు అధిక మైలేజీని ఎలా పొందాలి
4 . చెస్ గ్రాండ్ మాస్టర్ అవ్వడం ఎలా?
5 . రక్షాబంధన్ రోజున సోదరిని ఎలా సర్‌ప్రైజ్ చేయాలి?
6 . ఆధార్ పాన్ లింక్ గురించి ఎలా తెలుసుకోవాలి
7 . వాట్సాప్ ఛానల్‌ను ఎలా క్రియేట్ చేయాలి
8 . ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్‌ను ఎలా పొందాలి?
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








