గూగుల్ యాడ్ సెన్స్ గురించి పూర్తి సమాచారం కావాలా,అయితే మీకోసమే

|

వెబ్‌సైట్లను నడిపే వారి కోసం గూగుల్ శుభవార్తను మోసుకొచ్చింది. అందులో మెళుకవలు నేర్చుకునే వారికోసం Google Search Conferenceను గూగుల్ ఇండియాలో నిర్వహించేందుకు రెడీ అయింది. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ Google Search Conference ఆగష్టు నెల వరకు జరుగుతుందని గూగుల్ తెలిపింది. మొత్తం 11 నగరాల్లో ఈ Google Search Conferenceను నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా వెబ్‌సైట్లను నడిపే పబ్లిషర్లకు అలాగే ఆదాయం ఎలా పొందాలో తెలుసుకోవాలనుకునేవారికి ఈ రంగంలో మెళుకవలను నేర్పనున్నారు.

 

జియో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ డీటీహెచ్ సేవలు, అన్నీ కలిపి రూ.1000కే !జియో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ డీటీహెచ్ సేవలు, అన్నీ కలిపి రూ.1000కే !

వెబ్‌సైట్ పబ్లిషర్లు, బ్లాగర్లకు

వెబ్‌సైట్ పబ్లిషర్లు, బ్లాగర్లకు

ఈ సదస్సు వల్ల భారతీయ వెబ్‌సైట్ పబ్లిషర్లు, బ్లాగర్లకు ఎంతో మేలు జరగనుందని, వారు తమ తమ సైట్లలో కంటెంట్‌ను ఇంటర్నెట్ యూజర్లకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఈ సదస్సు పనికొస్తుందని గూగుల్ వెల్లడించింది.

వెబ్‌మాస్టర్లకు పలు ఆసక్తికర అంశాలపై ..

వెబ్‌మాస్టర్లకు పలు ఆసక్తికర అంశాలపై ..

తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన వెబ్‌సైట్లను నడిపే పబ్లిషర్ల కోసం గూగుల్ ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా వెబ్‌మాస్టర్లకు పలు ఆసక్తికర అంశాలపై గూగుల్ సిబ్బంది అవగాహన కల్పించనున్నారు.

గూగుల్ యాడ్‌సెన్స్‌ను వాడే వారికి..
 

గూగుల్ యాడ్‌సెన్స్‌ను వాడే వారికి..

గూగుల్ సెర్చ్ ఎలా పనిచేస్తుంది, సెర్చ్ రిజల్ట్స్‌లో వెబ్‌సైట్లు కనిపించాలంటే ఏం చేయాలి, మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్లను ఎలా డిజైన్ చేయాలి, గూగుల్ సెర్చ్ నియమ నిబంధనలతోపాటు గూగుల్ యాడ్‌సెన్స్‌ను వాడే వారికి కూడా పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

పాటించాల్సిన నియమాలు

పాటించాల్సిన నియమాలు

యాడ్‌సెన్స్‌ను వాడేవారు పాటించాల్సిన నియమాలు, కామన్‌గా చేసే మిస్టేక్స్ తదితర అంశాలను ఈ Google Search Conferenceలో తెలియజేయనున్నారు.

ఈ సదస్సుకు హాజరు కావాలనుకుంటే

ఈ సదస్సుకు హాజరు కావాలనుకుంటే

https://docs.google.com/forms/d/e/1FAIpQLScpfi7C6X2leKvDtBjvUSOxu92nAx0dbKAgG1ebYQYBnuuBnQ/viewform అనే వెబ్‌సైట్‌లో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. ఆయా సిటీల్లో ఈవెంట్లు జరిగే తేదీలకు 10 రోజుల ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.

గూగుల్ సెర్చ్ కాన్ఫరెన్స్ జరగనున్న నగరాలు, తేదీలు

గూగుల్ సెర్చ్ కాన్ఫరెన్స్ జరగనున్న నగరాలు, తేదీలు

1. గుర్గావ్ - జూన్ 20, 2. పూణె - జూన్ 22, 3. ఇండోర్ - జూలై 2, 4. పాట్నా - జూలై 4, 5. లక్నో - జూలై 6, 6. హైదరాబాద్ - జూలై 16, 7. విశాఖపట్నం - జూలై 18, 8. కోల్‌కతా - జూలై 20, 9. కోయంబత్తూర్ - జూలై 30, 10. చెన్నై - ఆగస్టు 1, 11. బెంగళూరు - ఆగస్టు 3

Best Mobiles in India

English summary
Google Search Conference 2018 announced across 11 cities in India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X