గూగుల్‌ని వెంటాడుతున్న బగ్,సెర్చ్ రిజల్ట్ మీద తీవ్ర ప్రభావం

By Gizbot Bureau
|

ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సెర్చ్ గత కొంత కాలం నుంచి కొన్ని ఇండెక్సింగ్ ఇష్యూలను ఎదుర్కొంటోంది. ఇండియాతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లేటెస్ట్ సెర్చ్ రిజల్ట్స్ ఏమీ కనిపించడం లేదు. ఇంటర్నెట్‌ వ్యాప్తంగా కొత్త కంటెంట్ గుర్తించడంలో గూగుల్ సెర్చ్ ఇండెక్సింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా గూగుల్ కంపెనీ తెలిపింది.

గూగుల్‌ని వెంటాడుతున్న బగ్,సెర్చ్ రిజల్ట్ మీద తీవ్ర ప్రభావం

 

'గూగుల్ సెర్చ్‌లో ఇండెక్సింగ్ ఇష్యూ కారణంగా కొన్ని సైట్లపై ప్రభావం పడుతుందని గుర్తించామని వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

మరో అప్‌డేట్ అందించేందుకు

మరో అప్‌డేట్ అందించేందుకు

ఇది చాలా సైట్ల మీద ప్రభావం పడుతోందని, ఆర్థికంగా ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశముందని గూగుల్ తెలిపింది. ఇప్పటికే దీనిపై మరో అప్‌డేట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. పూర్తి సమాచారాన్ని సేకరించగానే షేర్ చేస్తాం' అని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం న్యూస్ హ్యాండిల్ గూగుల్ Webmasters ట్వీట్ చేసింది.

URL Inspection tool

URL Inspection tool

సెర్చ్ రిజల్ట్స్ ఇష్యూను పరిష్కరించే దిశగా తమ టీమ్ పనిచేస్తున్నట్టుఈ ట్వీట్ లో తెలిపింది. Search Consoleలోని URL Inspection tool ద్వారా ఇండెక్సింగ్ ఇష్యూలను గుర్తించి వెంటనే పరిష్కరించనున్నట్టు గూగుల్ వెబ్ మాస్టర్స్ ట్వీట్ చేసింది.

ఇండెక్సింగ్ వర్క్ చేసే చాలామంది యూజర్లు
 

ఇండెక్సింగ్ వర్క్ చేసే చాలామంది యూజర్లు

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఇండెక్సింగ్ వర్క్ చేసే చాలామంది యూజర్లు గూగుల్ ఇండెక్సింగ్ సమస్యలపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రాన్స్ లో 20 నిమిషాల వరకు ఇండెక్సింగ్ ఇష్యూ తలెత్తింది. న్యూస్ పేపర్లు, డిజిటల్ మీడియాకు ఇదో బిగ్ ఇష్యూ' అని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) ప్రొఫెషనల్ ట్వీట్ చేశారు. కొన్ని బ్రాండ్ వెబ్ సైట్లలో తన క్లయింట్ వెబ్ సైట్లకు సంబంధించి ఇండెక్సింగ్ ఇష్యూ తలెత్తిందని, సాధ్యమైనంత తొందరగా ఈ ఇష్యూను ఫిక్స్ చేయాల్సిందిగా ట్వీట్ చేశాడు. సెర్చ్ ఇంజిన్ లో లేటెస్ట్ రిజల్ట్స్ ఇండెక్స్ కాకపోయినా.. అయినట్టుగా గూగుల్ చూపిస్తోందని తెలిపాడు. త్వరలో ఈ ఇష్యూను గూగుల్ ఫిక్స్ చేస్తుందని ఆశిస్తున్నాని మరో ట్వీట్ చేశాడు.

6 గంటల్లో బగ్ గుర్తింపు

6 గంటల్లో బగ్ గుర్తింపు

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో BUGను గుర్తించడానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని గూగుల్ వెబ్ మాస్టర్స్ అప్‌డేట్ మరో ట్వీట్ చేసింది. ‘ఈ ఇష్యూలో ఎక్కువ భాగాన్ని ఫిక్స్ చేశాం. ప్రత్యేకించి URL ఇన్స్ పెక్షన్ టూల్ మళ్లీ యథావిధిగా పనిచేస్తుంది. మిగిలిన ఇష్యూలపై మా టీం వర్క్ చేస్తూనే ఉంది. ఒకసారి పూర్తి స్థాయిలో BUG ఫిక్స్ చేశాక మరింత సమాచారాన్ని అప్‌డేట్ చేస్తామని తెలిపింది. ఇప్పటివరకూ గ్లోబల్‌గా చాలా ప్రాంతాల్లో గూగుల్ సెర్చ్ బగ్ ఎఫెక్ట్ అయింది. అయితే ఈ బగ్ ను పూర్తి స్థాయిలో ఫిక్స్ చేశారా లేదా అనేది రివీల్ చేయలేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Search encountering issues with indexing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X