గూగుల్ నుంచి అదిరే ఫీచర్!

By Madhavi Lagishetty
|

గూగుల్....ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టేసుకున్న సెర్చింజన్. రోజురోజుకూ ఏదోక అప్ డేట్ చేసుకుంటూ...యూజర్లకు చేరువవుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్.

 
గూగుల్ నుంచి అదిరే ఫీచర్!

ఉదయం టిఫిన్...మధ్యాహ్నం లంచ్....రాత్రికి డిన్నర్ కోసం రెస్టారెంట్ల వద్ద జనం క్యూ కడుతుంటారు. ఫేమస్ రెస్టారెంట్ అయితే...గంటల తరబడి మరి క్యూలో నిలబడుతుంటారు. క్యూలో నిలబడితే...ఆకలి కాదు...నీరసం, అలసట వస్తుంది.

అయితే వీటన్నింటికి సెర్చింజన్ గూగుల్ త్వరలోనే చెక్ పెట్టనుంది. గూగుల్ సెర్చ్ మ్యాప్లో రెస్టారెంట్ల వేయింటింగ్ టైమ్స్ ను చేర్చనుంది. దీనికోసం ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్ మీకు ఇష్టమైన రెస్టారెంట్ల వద్ద ఎంత సమయం వేచి ఉండాలని చూపుతుంది. ప్రపంచంలో ఉన్న ఒక మిలియన్ రెస్టారెంట్లకు సంబంధించిన టైం షెడ్యూల్ ను గూగుల్ సెర్చ్ మ్యాప్లో చూసే వీలుంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటే...ఒక పాపులర్ రెస్టారెంట్ కోసం వెతకండి. బిజినెస్ జాబితాను ఒపెన్ చేసి ...పాపులర్ టైమ్స్ విభాగానికి స్క్రోల్ చేయండి.

రూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటారూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటా

స్పెసిఫిక్ సమయంలో రెస్టారెంట్స్ తో అసోసియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. N గంట బార్ ప్రెస్ చేయడం ద్వారా మీకు కావాల్సిన సమయాన్ని కేటాయిస్తుంది.

ఒక్కరోజులో చాలాసార్లు వేచి చూడటానికి మీరు ఎడమ బార్ కింద మరియు కుడవైపు స్క్రోల్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఇతరుల కంటే ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే...పాపులర్ టైమ్స్ విభాగం చార్ట్లో మీరు టైమ్ ఫ్రేమ్ పై క్లిక్ చేసినప్పుడు కనిపించే పాప్ అప్ బాక్స్ ను గూగుల్ చూపిస్తుంది. ఈ బాక్స్ లైవ్ లేదా హిస్టారికల్ డేటాను బిజీగా, లేదా బిజీగా లేనట్లుగా ఉంటే లేబుల్లతో చూపిస్తుంది. అంతేకాదు ఇది ఎంత సమయం పడుతుందని కూడా అంచనా వేసి మరీ చూపిస్తుంది.

గూగుల్ అందుబాటులోకి తేనున్న ఈ నూతన ఫీచర్తో, టీ, స్నాక్స్, లంచ్ కోసం రెస్టారెంట్ కు వెళ్లి మీ సమయాన్ని వ్రుదా చేయద్దనుకుంటే...ఈ ఫీచర్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు మీకు కావాల్సిన సమయంలో రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో...ఎంజాయ్ యువర్ ఫుడ్.

Best Mobiles in India

Read more about:
English summary
Google is all set to roll out wait times at restaurants on Google Search and Maps soon. This feature will show you the estimated wait times.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X