Google సెర్చ్ యొక్క పాత ఇన్-బిల్ట్ టైమర్ ఫీచర్ మళ్లీ అందుబాటులోకి....

|

గూగుల్ సెర్చ్ లో ఇంతకుముందు ఇన్-బిల్ట్ టైమర్ అని పిలువబడే ఉపయోగకరమైన ఫీచర్ ఉండేది. తరువాత కొన్ని కారణాల దృష్ట్యా దీనిని తొలగించారు. అయితే దీనిని ఇప్పుడు గూగుల్ సంస్థ మళ్ళి అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇది గూగుల్ సెర్చ్ హోమ్ పేజీ నుండి నేరుగా టైమర్‌ను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈసారి కౌంట్ అప్ చేయాలనుకునే వారికి స్టాప్‌వాచ్‌గా కూడా డబ్ చేయబడింది. ఈ ఫీచర్ 2013లో మొదటిసారి ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 'x నిమిషాలకు టైమర్‌ని సెట్ చేయి' అని టైప్ చేయడం ద్వారా టైమర్‌ను సెట్ చేయడానికి లేదా స్టాప్‌వాచ్‌ను ప్రారంభించేందుకు ఇది వినియోగదారులను ఎనేబుల్ చేసింది. అయితే ఈ ఫీచర్ గత నెలలో కనిపించకుండా పోయింది. దీనితో కంపెనీ మొదటి పేజీ నుంచి ఈ ఫీచర్‌ను ఎందుకు తొలగించిందో అని వినియోగదారులు ఆశ్చర్యపోయారు.

 

ఇన్-బిల్ట్ టైమర్ ఫీచర్‌

గూగుల్ సెర్చ్ లో ఇన్-బిల్ట్ టైమర్ ఫీచర్‌ను తొలగించిన సమయంలో గూగుల్ సెర్చ్ యొక్క పబ్లిక్ లైజన్ డానీ సుల్లివన్ మాట్లాడుతూ కొన్ని సమస్యల కారణంగా గూగుల్ సెర్చ్ నుండి అంతర్నిర్మిత టైమర్ తీసివేయబడిందని ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఫీచర్ త్వరలోనే ప్లాట్‌ఫారమ్‌లోకి తిరిగి వస్తుందని కూడా చెప్పారు. అయితే సమస్య వివరాలను మరియు దానికి గల కారణాల గురించి గూగుల్ ఎగ్జిక్యూటివ్ వివరించలేదు.

దాదాపు ఒక నెల తర్వాత ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో టైమర్ మరియు స్టాప్‌వాచ్ ఫీచర్‌లు మళ్లీ అమలవుతున్నాయి. ఈ విషయాన్ని సుల్లివన్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు. "వెల్కమ్ బ్యాక్ "గూగుల్ X నిమిషాలకు టైమర్‌ని సెట్ చేసింది." ఇది మళ్లీ పని చేయడానికి కృషి చేసిన బృందానికి వందనాలు," టెక్స్ట్ మెసేజ్ తో ట్విట్టర్ లోని పోస్ట్‌లో రాశాడు.

గూగుల్ సెర్చ్‌లో టైమర్‌ను సెట్ చేయడం
 

గూగుల్ సెర్చ్‌లో టైమర్‌ను సెట్ చేయడం

గూగుల్ సెర్చ్‌లో టైమర్‌ను సెట్ చేయడం లేదా స్టాప్‌వాచ్‌ని ప్రారంభించడం మాత్రమే మీరు గూగుల్ ని ఉపయోగించి సమయాన్ని ట్రాక్ చేయగల మార్గం కాదు. వినియోగదారులు PCలో పని చేస్తున్నప్పుడు మరియు వారు కొంత సమయం ట్రాక్ చేయాలి లేదా ఒక నిర్దిష్ట సమయంలో మరేదైనా గుర్తుకు తెచ్చుకోవాలి. గూగుల్ సెర్చ్ లో టైమర్‌ను సెట్ చేయమని లేదా స్టాప్‌వాచ్‌ని ప్రారంభించమని వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ పరికరాలలో గూగుల్ అసిస్టెంట్‌ని కూడా అడగవచ్చు. ఇందుకోసం వినియోగదారులు చేయవలసిందల్లా "Ok Google, 10 నిమిషాలకు టైమర్‌ని సెట్ చేయండి" లేదా "Ok Google, ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది?" లేదా "Ok Google, టైమర్‌ని రద్దు చేయండి" వంటి సాధారణ వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి వినియోగదారులు సమయాన్ని సెట్ చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ ని మరింత సులభతరం చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫీచర్‌

గూగుల్ మ్యాప్స్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫీచర్‌

గూగుల్ మ్యాప్స్‌ యొక్క ఉపయోగం గురించి ప్రత్యేకంగా తెలుపవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరమైన మరొక కొత్త ఫీచర్‌ని అందుకున్నది. ఇది మీరు సెర్చ్ చేస్తున్న ఏదైనా స్థలంలో గల గాలి నాణ్యతను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫంక్షనాలిటీతో మీరు సందర్శించే ముందే ఆ స్థలం యొక్క గాలి నాణ్యతను కనుగొనడానికి మీకు సహాయం చేస్తుంది. తద్వారా మీరు నిజంగా అక్కడికి వెళ్లాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేది గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త మ్యాప్ లేయర్. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఇతర సమాచారం కోసం మీకు తెలియని కొత్త ప్లేస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఆ లేయర్‌ని ఆన్ చేసి ఆ స్థలం యొక్క గాలి నాణ్యతను మరియు సమీపంలోని ముఖ్యమైన స్థలాలను కూడా చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Google Search’s in-Built Timer Feature Started Working Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X