గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 4 విషయాలు వెతకకండి.. లేదంటే జైల్లో పడతారు!!
Google Search: గూగుల్.. ఈ పేరు తెలియని వాళ్లండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీనిని విరివిగా వాడేస్తున్నారు. ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏదైనా సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ తల్లిని అడుగుతాం. అది మనకు క్షణాల్లో సమాధానం చెప్పేస్తుంది. అంతేకాదు, లోతైన పరిశోధనలు చేయడానికి కూడా ఇది ఒక అద్భుతమైన సాధనం. అయితే, గూగుల్‌ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని విషయాలు గూగుల్‌లో వెతకడం వల్ల మీరు ఊహించని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మీరు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు, ఏం వెతుకుతున్నారు అనే విషయాలను ప్రభుత్వాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు నిశితంగా గమనిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేరాలు జరగకుండా చూడాలి, ప్రజల భద్రతను కాపాడాలి.

అందుకే కొన్ని రకాల సెర్చ్‌లు మిమ్మల్ని నేరుగా విచారణల పాలు చేయవచ్చు. భారీ జరిమానాలు కట్టాల్సి రావచ్చు, ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అందుకే, గూగుల్‌లో వెతికే ముందు ఒకట్రెండుసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పబోయే 4 విషయాల గురించి మాత్రం పొరపాటున కూడా గూగుల్‌లో వెతకకండి, మీ జీవితం ప్రమాదంలో పడుతుంది.
* బాంబు ఎలా తయారు చేయాలి
బాంబు ఎలా తయారు చేయాలి? (How to make a bomb) అని అస్సలు వెతకకండి. బాంబులు తయారు చేసే విధానాల గురించి వెతకడం చాలా దేశాల్లో నేరం. ఎందుకంటే భద్రతా సంస్థలు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఉగ్రవాదం వంటి వాటికి సంబంధించిన ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెడతాయి.
మీరు సరదాగా, కుతూహలంతో వెతికినా సరే, అది అనుమానాస్పదంగా మారుతుంది. ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చాలా కఠినమైన చట్టాలు పెట్టాయి. ఒక్కసారి మీరు ఇలాంటి సెర్చ్ చేసినా, మిమ్మల్ని వెంటనే విచారణకు పిలుస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ఒక్కోసారి అరెస్ట్ కూడా చేస్తారు.
* పిల్లల అశ్లీల చిత్రాలు (Child Pornography)
పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాల కోసం వెతకడం ప్రపంచవ్యాప్తంగా నేరం. ఇది చాలా తీవ్రమైన నేరం. దీనికి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. చాలా సంవత్సరాలు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారు. మన భారతదేశంలో కూడా 'పోక్సో చట్టం' (POCSO Act) వంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి.
ఇలాంటి కంటెంట్‌ను వ్యాప్తి చేసే వెబ్‌సైట్‌లను అధికారులు నిరంతరం కనిపెడుతూ బ్లాక్ చేస్తారు. ఒక్కోసారి మీరు పొరపాటున అలాంటి వాటిపై క్లిక్ చేసినా, అది మిమ్మల్ని లీగల్ చిక్కుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటిని సెర్చ్ చేయడం కూడా మెంటల్ హెల్త్‌కు మంచిది కాదు.
* హ్యాకింగ్ ట్యుటోరియల్స్ లేదా సాఫ్ట్‌వేర్ (Hacking Tutorials or Software)
హ్యాకింగ్‌కు సంబంధించిన సమాచారం, అంటే హ్యాకింగ్ ఎలా చేయాలి?, సాఫ్ట్‌వేర్లు, పద్ధతులు వంటి వాటి గురించి వెతకడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అనుమతి లేకుండా హ్యాకింగ్ చేయడం నేరం. మన దేశంలో 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం' (IT Act), అమెరికాలో 'కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యాక్ట్' (CFAA) వంటి సైబర్ సెక్యూరిటీ చట్టాలు ఉన్నాయి.
అయితే, ఎథికల్ హ్యాకింగ్ (నైతిక హ్యాకింగ్) చట్టబద్ధమే, కానీ దానికి సరైన సర్టిఫికేషన్ ఉండాలి. మీరు చట్టవిరుద్ధమైన హ్యాకింగ్ కంటెంట్ కోసం వెతికితే, భద్రతా సంస్థలు వెంటనే మిమ్మల్ని గుర్తిస్తాయి. దీని వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు హ్యాకింగ్ నేర్చుకోక ముందే శిక్ష అనుభవించాల్సి రావచ్చు.
* దొంగతనంగా సినిమాలు చూడటం (Pirated Movies)
పైరసీ చేసిన సినిమాలు డౌన్‌లోడ్ చేయడం లేదా చూడటం చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుంది. పొరపాటున పైరసీ కంటెంట్ కోసం వెతికినా, అది చట్టవిరుద్ధమైన పైరసీ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇచ్చినట్లే అవుతుంది. చాలా దేశాల్లో పైరసీకి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి.
భారతదేశంలో పైరసీకి పాల్పడిన వారిని పట్టుకుంటే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే వాడండి.
ప్రభుత్వాలు యూజర్ల ఆన్‌లైన్ కార్యకలాపాలను ఎలా ట్రాక్ చేస్తాయంటే.. ప్రభుత్వాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ సెక్యూరిటీ టూల్స్‌ను ఉపయోగిస్తాయి. వీటి ద్వారా చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కార్యకలాపాలను పసిగడతాయి. కీలక పదాలు, మీరు వెతికే విధానం, అనుమానాస్పద సెర్చ్‌లు వంటి వాటిని ట్రాక్ చేస్తారు.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs), సెర్చ్ ఇంజన్లు, భద్రతా సంస్థలు మీ సెర్చ్ హిస్టరీని లాగ్ చేస్తాయి, అంటే రికార్డ్ చేస్తాయి, ఆపై వాటిని సమీక్షిస్తాయి. చట్టాలు, డేటా రక్షణ నియమాలు ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించడానికి, ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి.


Click it and Unblock the Notifications








