అమెజాన్‌కు గూగుల్ షాక్, ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ సేఫ్

By Gizbot Bureau
|

సెర్చ్ ఇంజిన్ రంగంలో దూసుకుపోతున్న టెక్ గెయింట్ గూగుల్ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. కొత్త కొత్త వ్యాపారాల్లోకి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కామర్స్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఈ కామర్స్ రంగంలోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది.

Google Shopping Platform Launched in the US, Chasing Amazon

అమెరికాలోని యూజర్ల కోసం గూగుల్ కొత్త షాపింగ్ ప్లాట్ ఫాం ప్రారంభించింది. Gmail అకౌంట్ ఉంటే చాలు. ఇకపై యూజర్లు ఈజీగా గూగుల్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే ఉంది. ఇండియాకు వస్తుందా రాదా అనేదానిపై క్లారిటీ లేదు. అయితే త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గూగుల్ షాపింగ్ ప్లాట్ ఫాం

గూగుల్ షాపింగ్ ప్లాట్ ఫాం

ఇప్పటివరకూ ఏదైనా ప్రొడక్టు కొనుగోలు చేయాలంటే గూగుల్ పేజీ ద్వారా ఈ కామర్స్ వెబ్ సైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. గూగుల్ షాపింగ్ ప్లాట్ ఫాం రాకతో ఇక ఆ ఇబ్బంది ఉండదు. నేరుగా గూగుల్ నుంచే షాపింగ్ చేసుకోవచ్చు. నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. గూగుల్ నుంచే నేరుగా డబ్బులు చెల్లించవచ్చు.

ఇంగ్లీష్ హిందీ భాషల్లో :

ఇంగ్లీష్ హిందీ భాషల్లో :

2018 ఏడాది నుంచి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా షాపింగ్ పేజీ యాక్సస్ చేసుకునేలా గూగుల్ UI (యూజర్ ఇంటర్ పేస్)ను పునరుద్ధరించింది. డిసెంబర్ నెలలోనే ఇండియాతో గూగుల్ యాక్సస్ ఇచ్చింది. వివిధ రిటైలర్ల నుంచి అన్ని కేటగిరీల్లో కొత్త సెర్చ్ ఎక్స్ పీరియన్స్ కోసం షాపింగ్ పేజీని గూగుల్ డిజైన్ చేసింది. అమెరికాలో షాపింగ్ ప్లాట్ ఫాం లాంచింగ్ చేయడానికి ముందు గూగుల్ భారత్, ఫ్రాన్స్ సహా కొన్ని ఇతర దేశాల్లో టెస్టింగ్ నిర్వహించింది.

మర్చంట్ సెంటర్ ద్వారా యాక్సస్

మర్చంట్ సెంటర్ ద్వారా యాక్సస్

రిటైలర్లు మర్చంట్ సెంటర్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ లో తమ ప్రొడక్టు ఫీడ్ అయ్యేలా రిటైలర్లకు అనుమతి ఇచ్చింది. గూగుల్ ఇండియాలో మర్చంట్ సెంటర్ హిందీ భాషలో యాక్సస్ ఇచ్చింది. గూగుల్ షాపింగ్ రిజల్ట్స్ ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషల్లోకి వస్తుందా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే వ్యాపారం లాభాల్లో కొనసాగితే మరింతగా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 జీమెయిల్ నుంచి యాక్సస్

జీమెయిల్ నుంచి యాక్సస్

గూగుల్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ మొబైల్, డెస్క్ టాప్ యూజర్లకు ప్రొగ్రసీవ్ వెబ్ యాప్ (PWA)ద్వారా అందబాటులో ఉంచింది. గూగుల్ అకౌంట్ లేదా జీమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ షాపింగ్ ప్లాట్ ఫాంను యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ పేరుతో పాటు తగిన సూచనలను చూపిస్తుంది.

Buy విత్ గూగుల్ గ్యారెంటీ

Buy విత్ గూగుల్ గ్యారెంటీ

అమెరికాలో స్టాక్ ప్రొడక్టుల కోసం వేర్ హౌస్‌ల నిర్మాణాన్ని ప్రారంభించాలని గూగుల్ ఆలోచన కాదు. కానీ, కాస్ట్కో, టార్గెట్ సహా సెలెక్టడ్ రిటైలర్లలు సంబంధించిన సమాచారాన్ని యూజర్లకు సూచించేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది. గూగుల్ షాపింగ్ ఫీచర్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. కొత్త షాపింగ్ ప్లాట్ ఫాంపై ఎక్స్ ప్రెస్ డెలవరీ సర్వీసు అనుసంధానం చేసేందుకు గూగుల్ ప్లాన్ చేస్తున్నట్టు 9టూ5 గూగుల్ తెలిపింది. ‘Buy విత్ గూగుల్ గ్యారెంటీ' ద్వారా కొన్ని ప్రొడక్టులను విక్రయించేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది. రిటైలర్ సరైన సమయానికి ప్రొడక్టు డెలవరీ చేయని పక్షంలో షాపర్లకు రిఫండ్ చేసేలా గూగుల్ గ్యారెంటీ ద్వారా సిఫార్స్ చేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Google Shopping Platform Launched in the US, Chasing Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X