ఫోటోల పై వాటర్‌మార్క్స్ తీసేస్తున్న గూగుల్ సాఫ్ట్‌వేర్

స్టాక్ ఫోటోలను పంపిణీ చేసే AdobeStock, Shutterstock, Getty Images, Alamy వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ షాకిచ్చేంత పనిచేసింది. గూగుల్ ఇంజినీర్లు రూపొందించిన ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫోటోల పై వాటర్ మార్కులను సెకన్ల వ్యవధిలో తొలగించి వేస్తోంది. ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమెటిక్‌గా పనిచేయటం విశేషం.

ఫోటోల పై వాటర్‌మార్క్స్ తీసేస్తున్న గూగుల్ సాఫ్ట్‌వేర్

Read More : మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!

ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్స్ తమ ఫోటోలకు సంబంధించిన కాపీరైట్స్‌ను కాపాడుకునేందుకు వాటి పై వాటర్‌మార్క్‌లను ఉంచటం సహజం. వాటర్‌మార్క్‌లను కలిగి ఉండే ఫోటోలను యజమాని పర్మిషన్ లేకుండా ఉపయోగించటం కుదరదు. ఈ తరుణంలో గూగుల్ రూపొందించిన ప్రత్యేకమైన అల్గారిథమ్ ద్వారా ఫోటో పై కనిపించే ఎటువంటి వాటర్ మార్క్ నైనా చిటికలో మాయం చేసేయవచ్చు. గూగుల్ ఈ సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా కాపీరైటెడ్ ఫోటోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

English summary
Google shows how easy it is for software to remove watermarks from photos. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot