Home
News

వైజాగ్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్‌ దిగ్గజం!

ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నంలో టెక్‌ దిగ్గజం గూగుల్ (Google) సుమారుగా 15 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్విని వైష్ణవ్‌, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గూగుల్‌ సంస్థ తరఫున గూగుల్‌ క్లౌడ్ సీఈవో థామస్‌ కురియన్‌, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ జజ్వా పాల్గొన్నారు.

విశాఖపట్నంలో పైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ :
గూగుల్‌కు సంబంధించి ఆసియాలో ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాజెక్టుగా విశాఖపట్నం హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్‌ అతిపెద్ద పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ తెలిపారు. జెమినీ ఏఐ, గూగుల్ ఇతర సేవలు ఈ డేటా సెంటర్‌ ద్వారా అందుతాయని చెప్పారు.

Google

గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా వైజాగ్‌ :
రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ మొత్తం పెట్టుబడులు పెడతామన్నారు. విశాఖపట్నం నుంచి 12 దేశాలతో సబ్‌సీ కేబుల్‌ విధానంలో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా వైజాగ్‌ మారనుందని గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ అన్నారు.

హర్షం వ్యక్తం చేసిన ఏపీ సీఎం :
డిజిటల్‌ కనెక్టివిటీ, డేటా సెంటర్‌, ఏఐ, రియల్‌టైం డేటా కలెక్షన్‌లు ముఖ్యమైనవని, టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందు ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తామని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు.

డిజిటల్‌ ఇన్నోవేషన్‌లో ఇదో కొత్త అధ్యాయం :
విశాఖలో గూగుల్‌ 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు ఒప్పందం చారిత్రకమని ఏపీ ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), డిజిటల్‌ ఇన్నోవేషన్‌లో ఇదో కొత్త అధ్యాయమన్నారు. ఈ ఒప్పందంలో డిజిటల్‌ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గూగుల్‌ సీఈవో సందర్ పిచాయ్‌ సోషల్ మీడియా పోస్ట్‌ :
విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటుచేయనున్న 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఒప్పందం జరిగిన నేపథ్యంలో.. గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌.. భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్‌లో మాట్లాడారు. విశాఖ ఏఐ హబ్‌ గురించి ప్రధానికి వివరించారు. ఈ విషయాన్ని సందర్‌ పిచాయ్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

విశాఖలో ఏఐ హబ్‌లో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌, సబ్‌సీ గేట్‌వే ఉండనున్నాయని చెప్పారు. ఈ హబ్‌ ద్వారా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని సంస్థలకు అందిస్తాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కు సంబంధించిన ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google signs MoU with Andhra Pradesh government to build AI Data center in visakhapatnam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X