గూగుల్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేస్తున్నాయ్!

గత కొంత కాలంగా ఇంటర్నెట్‌లో చెలరేగుతోన్న రూమర్స్‌కు చెక్ పెడుతూ గూగుల్ తన అప్‌కమింగ్ స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించిన అఫీషియల్ న్యూస్‌ను విడుదల చేసింది. 2017 ఆరంభంలోనే గూగుల్ స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేయబోతున్నట్లు గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ (ఆండ్రాయిడ్ వేర్ విభాగం) జెఫ్ చాంగ్ తెలిపారు.

గూగుల్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేస్తున్నాయ్!

Read More : ఇక 3జీ ఫోన్‌లలో రిలయన్స్ Jio!

గూగుల్ స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్ వేర్ 2.0 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. బ్రాండింగ్ వచ్చేసరికి ఇవి గూగుల్ బ్రాండ్‌తో వస్తాయా లేక పిక్సల్ బ్రాండ్‌తో వస్తాయా అనేది తెలియాల్సి ఉంది. జనవరి 5 నుంచి 8 మధ్య లాస్‌వేగాస్ వేదికగా జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో ఈ స్మార్ట్‌వాచ్‌లను అఫీషయల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

గూగుల్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేస్తున్నాయ్!

Read More : వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ (2016)

అనధికారికంగా తెలియవచ్చిన మేరకు గూగుల్ స్మార్ట్‌వాచ్‌లు వివిధ సైజుల్లో అందుబాటులో ఉంటాయి. పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ఆండ్రాయిడ్ పే, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు గూగుల్ వాచ్‌లలో ఉండబోతున్నాయి. మోటరోలా, యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లను ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విస్తరిస్తోన్న స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరింత ట్రెండీగా..

సోనీ, సామ్‌సంగ్, మోటరోలా, యాపిల్ వంటి దిగ్గజం కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తున్నాయి.

ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు

స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌ల వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.

మరింత సౌకర్యవంతంగా..

స్మార్ట్‌వాచ్‌లు మొబిలిటీని మీకు మరింత సౌకర్యవంతం చేస్తాయి. స్మార్ట్‌వాచ్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మీ కారుకు నిరంతరం కనెక్ట్ అయి ఉండొచ్చు వెతుక్కోవచ్చు.

స్విమ్మింగ్ సమయంలోనూ మ్యూజిక్‌

వాటర్ ప్రూఫ్  స్మార్ట్‌వాచ్‌‌ల ద్వారా స్విమ్మింగ్ చేస్తూ కూడా మొబైలింగ్‌ను ఆస్వాదించవచ్చు. స్మార్ట్‌వాచ్‌ ద్వారా స్మార్ట్‌హోమ్ డివైజ్‌లను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.

వెర్బల్ కమాండ్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి

స్మార్ట్‌వాచ్‌లు వెర్బల్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తాయి. అంటే మనం ఏం చెబితే అవి చేస్తాయనమాట. స్మార్ట్‌వాచ్‌ ద్వారా మీ చిన్నారి లోకేషన్‌ను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ప్రీలోడెడ్ సెన్సార్ లో వస్తోన్న స్మార్ట్‌వాచ్ లు మన ఆర్యోగాన్ని కూడా మానిటర్ చేయగలవు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google smartwatches are coming in 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot