గూగుల్ హోమ్ కొత్త ఫీచర్ ‘‘ స్ట్రీమ్ ట్రాన్స్‌ఫర్ ’’

By Gizbot Bureau
|

టెక్ దిగ్గజం గూగుల్ stream transfer పేరుతో కొత్త ఫీచర్ ని అనౌన్స్ చేసింది. గూగుల్ హోమ్ వాడే వారికోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చాలా త్వరగా మ్యూజిక్ ఫాస్ట్ ట్రాక్స్, వీడియోస్ , ఇంకా ఇతర ఎంటర్ టైన్ మెంట్లకు మూవ్ కావచ్చు. ఈ ఫీచర్ వాయిస్ కాల్ మీద కూడా పనిచేస్తుంది. గూగుల్ హోమ్ యాప్ ద్వారా టచ్ స్కీన్ మీద టచ్ చేస్తే Google Nest smart displays అవుతాయి. ఇది multiple Google Home, Chromecast, and Nest devices మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తూ యూజర్లకు బెటర్ అనుభూతిని అందివ్వనుంది. దీని ద్వారా మల్టిపుల్ స్మార్ట్ టీవీస్, స్మార్ట్ స్పీకర్స్ నుండి మంచి అనుభవాన్ని పొందవచ్చు.

 

మీరు ఏం చేయాలి ?

మీరు ఏం చేయాలి ?

మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవరం లేదు. జస్ట్ హే గూగుల్ మూవ్ ది మ్యూజిక్ టూ లివింట్ రూమ్ స్పీకర్ అని అంటే చాలు. వెంటనే మీకు గూగుల్ హోమ్ స్పీకర్ మీ మ్యూజిక్ నుండి లివింగ్ రూంలో ఉన్న స్పీకర్ కి వెళుతుంది. వెంటనే అక్కడ ఉన్న సంగీతాన్ని మీరు వినవచ్చు

బటన్

బటన్

ఇక వాయిస్ వద్దనుకుంటే ప్రత్యేకంగా బటన్ కూడా ఉంది. ఈ బటన్ ద్వారా మీరు మీ లివింగ్ రూంలోకి కాని, స్మార్ట్ టీవీకి కాని, లేకుంటే స్మార్ట్ స్పీకర్స్ కి కాని కనెక్ట్ కావచ్చు. దీంతో పాటుగా గూగుల్ Nest Hub and Nest Hub Max లను కూడా డిస్ ప్లేలో చూపిస్తుంది. దీని ద్వారా మీరు యూట్యూబ్ కంటెంట్ కూడా వీక్షించవచ్చు. 

యూట్యూబ్ కనెక్ట్ 
 

యూట్యూబ్ కనెక్ట్ 

మీరు ఈ ఫీచర్ ద్వారా యూట్యబూ్ వీడియోని మీ Chromecast-connected TVకి సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Hey Google, play it on living room TV. అనిచెబితే చాలు. అది నేరుగా మీ లివింట్ రూమ్ కి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా, మీరు గూగుల్ హోమ్ అనువర్తనం ద్వారా గూగుల్ హోమ్ స్పీకర్లు లేదా గూగుల్ నెస్ట్ స్మార్ట్ డిస్ప్లేల సమూహాన్ని సెటప్ చేయవచ్చు. సమూహం ఏర్పాటు చేసిన తర్వాత, మీరు ఒకే స్పీకర్ నుండి కంటెంట్‌ను బదిలీ చేయవచ్చు లేదా గ్రూపుకి ప్రదర్శించవచ్చు.

సులభతరం చేయడం కోసం 

సులభతరం చేయడం కోసం 

"ఇప్పుడు మిలియన్ల మంది వినియోగదారులు టీవీలు, స్మార్ట్ స్పీకర్లు మరియు స్మార్ట్ డిస్ప్లేలను కలిగి ఉన్నారు, ప్రజలు గది నుండి గదికి మారినప్పుడు వారి మీడియాను నియంత్రించడాన్ని సులభతరం చేయాలన్నదే మా ప్రయత్నం అని ప్రొడక్ట్ మేనేజర్ క్రిస్ చాన్ గూగుల్ నెస్ట్, బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. కాగా గూగుల్ అన్ని క్రోమ్‌కాస్ట్‌లు, గూగుల్ హోమ్ మరియు నెస్ట్ స్మార్ట్ స్పీకర్లు మరియు డిస్ప్లేలకు స్ట్రీమ్ ట్రాన్స్ఫర్ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా, ఇది యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై మరియు పండోర వంటి ఆడియో అనువర్తనాలతో పాటు యూట్యూబ్‌తో అనుకూలంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Google Brings 'Stream Transfer' Feature to Enable Easy Transferring Between Home, Chromecast, Nest Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X