గూగుల్ అకౌంట్లలో ఉన్న డేటాని డౌన్లోడ్ చేయడం ఎలా..?

Posted By: Staff

గూగుల్ అకౌంట్లలో ఉన్న డేటాని డౌన్లోడ్ చేయడం ఎలా..?

గూగుల్ కొత్త అన్వేషణకు మారుపేరు. ఎప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త సర్వీస్‌లను ఉత్పత్తి చేస్తుంది కాబట్టే అది నెంబర్ వన్ కాగలింది. గూగుల్ వాయిస్‌కి మీరు పెద్ద ఫ్యాన్ అయిఉంటే అటువంటి వాయిస్‌కి సంబందించిన డేటాని మీరు స్టోర్ చేసుకునేందుకు కొత్తగా గూగుల్ కొత్త సర్వీస్‌‍‌ని ప్రవేశపెట్టింది. దాని పేరే గూగుల్ టేక్ అవుట్. దీని ఉపయోగం ఏమిటంటే గూగుల్ ప్రొడక్ట్స్‌లో ఉన్న మన డేటాని డౌన్‌లోడ్ చేసుకోవటానికి Google Takeout అనే క్రొత్త వెబ్ సర్వీస్ ని గూగుల్ ప్రారంభించింది. ఫ్రొఫైల్ సమాచారం తో పాటు కాంటాక్ట్స్, బజ్ మరియు పికాసాల నుండి డేటాని ZIP ఫైల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా గూగుల్ డాష్ బోర్డ్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. గూగుల్ అందించిన సర్వీస్‌లలో కెల్లా ఇదోక గొప్ప సర్వీస్. దీనితోపాటే ఇటీవలే గూగుల్ వాయిస్ సెర్చ్ సర్వీస్‌ని ప్రవేపెట్టిన విషయం తెలిసిందే. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ వాయిస్ సెర్చ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీ పర్సనల్ కంప్యూటర్‌లో మైక్ర్ ఫోన్ ఉంటే అందులో మీకు కావాల్సిన సమాచారం గురించి మాట్లాడితే అది గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి క్వరీగా వెల్లడం జరుగుతుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మీకు తెలియని పదాలు గురించి వెతుకుతున్నప్పడు మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ గనుక మీ డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో గనుకు లేకపోయినట్లైతే, క్రోమ్ వెబ్ స్టోర్ నుండి మీరు దీనికి సంబంధించిన ఫోడిగింపు భాగాన్ని పోందవచ్చు. దీనిని మీ పిసిలో ఇనిస్టాల్ చేసుకొని గూగుల్ వాయిస్‌పై ప్రయోగం చేయవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot