Home
News

ఆధార్‌పై సారీ చెప్పిన గూగుల్, అసలేమైంది !

ఆన్‌లైన్ ప్రపంచంలో దూసుకుపోతున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సారీ చెబుతూ అనూహ్య ప్రకటన విడుదల చేసింది.

By Hazarath Aiah

ఆన్‌లైన్ ప్రపంచంలో దూసుకుపోతున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సారీ చెబుతూ అనూహ్య ప్రకటన విడుదల చేసింది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల ప్రమేయం లేకుండా.. వారి కాంటాక్ట్‌ లిస్ట్‌లోకి కొత్తగా జతచేరిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబరే..అసలు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందోనని యూజర్లు తెగ ఆలోచిస్తూ కంప్లయిట్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇది తమ తప్పిదం కాదని యూఐడీఏఐ తేల్చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

యూఐడీఏఐ ప్రమేయం లేకుండా..

యూఐడీఏఐ ప్రమేయం లేకుండా..

యూఐడీఏఐ ప్రమేయం లేకుండా ఆ నంబర్ ఎలా వచ్చిందని యూజర్లు ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ అనూహ్య ప్రకటన చేసింది.

యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌..

యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌..

ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్‌లోకి వచ్చిన యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ తమ తప్పిదమేనని గూగుల్‌ ప్రకటించింది. తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించింది.

కోడింగ్‌ తప్పిదం కారణంగా ..

కోడింగ్‌ తప్పిదం కారణంగా ..

దీనిపై గూగుల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. కోడింగ్‌ తప్పిదం కారణంగా పాత టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-300-1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్‌ 112 యూజర్ల సెటప్‌ విజార్డ్‌లోకి చేరిపోయాయని గూగుల్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

మాన్యువల్‌గా డిలీట్‌..

అయితే ఇది తాము ఏ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలోకి అనధికారికంగా చొరబడాలని చేసింది కాదని స్పష్టంచేసింది. యూజర్లు తమ డివైజ్‌ల నుంచి ఈ నెంబర్‌ను మాన్యువల్‌గా డిలీట్‌ చేయొచ్చని పేర్కొంది.

వేలాది ఫోన్లలో..

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రమేయం లేకుండా యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ వేలాది ఫోన్లలో కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు.

ఫోన్‌లో సేవ్ చేయకుండానే..

ఫోన్‌లో సేవ్ చేయకుండానే..

నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు.

స్క్రీన్‌షాట్ తీసి ..

స్క్రీన్‌షాట్ తీసి ..

ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్‌షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అప్పటికీ ఈ గందరగోళంపై యూఐడీఏఐ ఇది అసలు తమ వాలిడ్‌ నెంబర్‌ కాదంటూ తేల్చేసింది.

టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947..

కాగా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) తమ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947 అని, రెండేళ్లకు పైగా దీన్నే వాడుతున్నామని ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Google Takes the Blame for UIDAI Number Showing Up in People's Phonebooks More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X