గూగుల్ యూజర్లూ.. మీకిది తెలుసా?

Posted By: Prashanth

గూగుల్ యూజర్లూ.. మీకిది తెలుసా?

 

సాన్ ఫ్రాన్సిస్కో: తన సెర్చ్ ఇంజన్‌కు, జీమెయిల్ యూజర్లకు మధ్య గూగుల్ వారధిని నిర్మిస్తోంది. ఈ మేరకు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఏదైనా సమాచారాన్ని కోరినపుడు.. వారి జీమెయిల్ అకౌంట్‌లో ఉన్న వివరాలను కూడా రిజల్ట్స్ పేజీలలో చూపించనుంది. ఈ జీమెయిల్ రిజల్ట్స్‌ను గూగుల్ పేజీలోని మెయిన్ రిజల్ట్స్‌కు కుడివైపున ప్రదర్శిస్తుంది.

ఉదాహరణకు సెర్చ్ లో ఎవరైనా 'రెస్టారెంట్‌వి అని టైప్ చేసినపుడు.. రిజల్ట్స్‌లో ఆ వ్యక్తి జీమెయిల్‌లో రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలు కూడా చూడొచ్చు. అయితే దీని కోసం.. సెర్చ్ చేసే వ్యక్తి గూగుల్‌లో సైనప్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది జీమెయి ల్ యూజర్లుండగా.. మొదట 10లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.

వీరి నుంచి ఫీడ్‌బ్యాక్ అందిన అనంతరం దీనిని ఇతర యూజర్లకు వర్తింపజేస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమీత్ సింఘాల్ వెల్లడించారు. గతంలో 'బజ్‌వి అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించి.. ఆ సైట్‌లో జీ మెయిల్ సమాచారాన్ని ఉపయోగించుకునే విషయంపై ప్రైవసీకి చెందిన సమస్యను ఎదుర్కొన్న గూగుల్.. ఈ సెర్చ్ ఫలితాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది.

గూగుల్ కొత్త ఆప్షన్‌పై ప్రతిస్పందించడానికి దా ని ప్రధాన పోటీదారులైన మైక్రోసాఫ్ట్, యాహూలు నిరాకరించాయి. తాము త్వరలో ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లలో.. మెరుగైన 'వాయిస్ పవర్డ్ సెర్చ్ అప్లికేషన్‌విను విడుదల చేస్తామని కూడా గూగుల్ ప్రకటించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot