గూగుల్‌లో మాట్లాడితే చాలు మీకు కావాల్సింది వస్తుంది

Posted By: Super

గూగుల్‌లో మాట్లాడితే చాలు మీకు కావాల్సింది వస్తుంది

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొంత మంది ఇంటర్నేషనల్ యూజర్స్ కొసం ప్రత్యేకంగా డెస్క్ టాప్ వెబ్ సెర్ట్ టూల్‌గా 'వాయిస్ కమాండ్‌'ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని జర్మనీలో ఉన్న గూగుల్ క్రోమ్ యూజర్ టెస్టు చేసి మరీ మాకు సమాచారం అందివ్వడం జరిగింది. అమెరికాకు చెందిన గూగుల్ క్రోమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు మే నుండి కూడా వాయిస్ సెర్చెస్‌ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ ఫీచర్‌ని ప్రపంచంలో ఉన్న అందరు యాజర్స్‌కి అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రస్తావించలేకపోతున్నారు.

గూగుల్ ప్రవేశపెట్టిన ఈ వాయిస్ సెర్చ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీ పర్సనల్ కంప్యూటర్‌లో మైక్ర్ ఫోన్ ఉంటే అందులో మీకు కావాల్సిన సమాచారం గురించి మాట్లాడితే అది గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి క్వరీగా వెల్లడం జరుగుతుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మీకు తెలియని పదాలు గురించి వెతుకుతున్నప్పడు మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ గనుక మీ డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో గనుకు లేకపోయినట్లైతే, క్రోమ్ వెబ్ స్టోర్ నుండి మీరు దీనికి సంబంధించిన ఫోడిగింపు భాగాన్ని పోందవచ్చు. దీనిని మీ పిసిలో ఇనిస్టాల్ చేసుకొని గూగుల్ వాయిస్‌పై ప్రయోగం చేయవచ్చు.

గతంలో మేము తెలిపిన దాని ప్రకారం గూగుల్ మ్యాప్స్‌కి గూగుల్ వాయిస్ సెర్చ్‌ని యాడ్ చేసిన విషయం తెలిసిందే. వాయిస్ సెర్చ్ అనేది తప్పనిసరిగా ఓ ప్రయోగాత్మకం అవుతుందని గూగుల్ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot