గూగుల్ ప్లస్ యూజర్స్ 400 మిలియన్లు..!

Posted By:

Google+ to have 400 mn users in 2012

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ 2012వ సంవత్సరం చివరికల్లా 400 మిలియన్ల యూజర్స్‌కు చేరుకుంటుందని ఓ ప్రముఖ రీసెర్చ్ సంస్ద ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 2011లో గూగుల్ ప్లస్‌ బీటా వర్సన్‌ని గూగుల్ విడుదల చేసిన సంగతి మనందరికి తెలిసిందే. గూగుల్ ప్లస్ విడుదలైన మూడు నెలలుకే 62మిలియన్ల యూజర్స్‌ అందులో ఎకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది.

అమెరికన్ ఎనలిస్ట్ 'పాల్ అల్లెన్' మాట్లాడుతూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్‌లో ప్రతి రోజుకీ 625, 000 యూజర్స్ సైన్ ఇన్ అవుతున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ సంఖ్య 700,000 పెరుగుతుందని జోస్యం చెప్పారు. ఇందుకు గల కారణం ప్రపంచంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ సెర్చ్ ఇంజన్ గూగుల్‌దేనన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం గూగుల్ ప్లస్ అభివృద్దిని గమనించినట్లేతే 2012 సంవత్సరం చివరకల్లా ఖచ్చితంగా 400 మిలియన్ల యూజర్స్‌ని సొంతం చేసుకుంటుందని తెలిపారు. ఇక ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఫేస్‌బుక్ యూజర్స్ సంఖ్య 800 మిలియన్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot