Just In
Don't Miss
- News
సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్: శవ రాజకీయం చేస్తున్నారు: గుడివాడ రావాలంటే భయం..కొడాలి నాని..!
- Finance
ఇన్వెస్టర్లూ.. అప్రమత్తంగా ఉండండి.. మీకోసం NSE ఇచ్చిన సలహాలు తెలుసా?
- Movies
ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా.. పూనమ్ కౌర్ మరో సంచలనం
- Sports
#ThisHappened2019: స్పోర్ట్స్‌లో అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్ ఏదో తెలుసా?
- Lifestyle
వైరల్ వీడియో : నీళ్లలో నిలబడే మనిషిని ఎప్పుడైనా చూశారా?
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
బెంగుళూరులో కొత్తగా గూగుల్ AI Research Lab
సిలికాన్ వ్యాలీ దిగ్గజం గూగుల్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. తన కార్యకలాపాలను ఇండియాలో మరింతగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా Artificial Intelligence ల్యాబ్ ని కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొల్పింది. ఈ ల్యాబ్ ద్వారా ఉత్పత్తులను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్ దిగ్గజం గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇండియాలో జరిగిన గూగుల్ ఈవెంట్లో వెల్లడించింది. బెంగుళూరు ల్యాబ్ కి SEM (Society for Experimental Mechanics విభాగంలో మనీష్ గుప్తా లీడ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఇండియాలో వైపై విస్తరణ కోసం గూగుల్ బిఎస్ఎన్ఎల్ తో జత కట్టిన సంగతి అందరికీ తెలిసిందే..

దేశవ్యాప్తంగా 'వై-ఫై సేవలు
టెక్ దిగ్గజం 'గూగుల్'తో జత కట్టింది. దేశవ్యాప్తంగా 'వై-ఫై సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు టెలికం రంగ సంస్ధలకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంథాతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం 'గూగుల్'తో జత కట్టింది. దేశవ్యాప్తంగా 'వై-ఫై' సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. గుజరాత్, బీహార్, మహారాష్ట్ర లో కొన్ని గ్రామాలను వైపై హాట్ స్పాట్ విలేజ్ లుగా తీర్చిదిద్దనుంది. దేశ వ్యాప్తంగా 5000 వెన్యూలను, మూడు రాష్ట్రాల్లో 500 రైల్వే స్టేషనన్లలో వైపై కేంద్రాలను ఏర్పాటు చేయడం గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్ లో ఉచిత వైఫై సేవలు
హైదరాబాద్ మహా నగరంలో ఇటీవల సుమారు 25 ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్-గూగుల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల ద్వారా అన్‌లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. వినియోగదారులు స్టేషన్ పరిధిలోకి వచ్చి వైఫై ఓపెన్ చేస్తే బీఎస్‌ఎన్‌ఎల్ గూగుల్ స్టేషన్ వైఫై సిగ్నల్ వస్తోంది. కనెక్ట్ చేస్తే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తోంది. దానిని ఎంటర్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతోంది. దానిని కాపీ చేసి ఎంటర్ చేస్తే వైఫ్ కనెక్ట్ అవుతుంది. వినియోగదారులు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.

డిజిటల్ ఇండియాలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న ‘డిజిటల్ ఇండియా'లో భాగాంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలు విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ హైదరాబాద్ నగర శివార్లలో స్వంతంగా 125 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసింది. హాట్ స్పాట్ పరిధిలో వైఫై కనెక్ట్ అయ్యే వినియోగదారుడు తన మొబైల్ కనెక్షన్ ద్వారా నెలకు 4 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఇప్పటివరకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థల దూసుకు వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియాను ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ద్వారా ముందుకు తీసుకువెళ్లాలని వ్యూహం రచిస్తోంది.

ఫ్రీ ‘వై-ఫై’ సర్వీసులు
ఇదివరకే బీఎస్ఎన్ఎల్ - గూగుల్ సంస్థతో కలిసి ఫ్రీ ‘వై-ఫై' సర్వీసుల కార్యక్రమాన్ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 38 వేల ‘వై-ఫై' హాట్ స్పాట్ కేంద్రాలు ఉన్నాయి. రూ.19 ఓచర్లను కొనుగోలు చేస్తే ‘వై-ఫై' సేవలు అందుబాటులోకి వస్తాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
39,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090