'సిఈఎస్' లో గూగుల్ టివి ప్రత్యేక ఆకర్షణ..

Posted By:

'సిఈఎస్' లో గూగుల్ టివి ప్రత్యేక ఆకర్షణ..

 

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మొట్టమొదటి గూగుల్ టివిని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ టీవి మార్కెట్లో‌పై చేయిగా ఉన్న సోనీ కార్పోరేషన్, శాంసంగ్ ఎలక్రానిక్స్‌లను తలదన్నే విధంగా తాము కొత్త గూగుల్ టివిని రూపొందిస్తున్నామని ఎల్‌జీ ప్రతినిధి వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌లో సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే.

దీనిని దృష్టిలో పెట్టుకోని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని టివిలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐతే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్మార్దకంగా మారింది. గూగుల్ టివి వినియోగదారులకు ఆన్‌లైన్ వీడియోలతో పాటు, నచ్చిన వెబ్‌సైట్స్‌ని కూడా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. వీడియో గేమ్స్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ అప్లికేషన్స్‌ని ఇందులో నిక్షిప్తం చేయనున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సోనీ టెలివిజన్స్‌ని గమనించినట్లేతే వాటిల్లో వీడియో గేమ్స్‌ని ఇన్‌బిల్ట్‌గా నిక్షిప్తం చేశారు. అదే విధంగా ఇప్పడు గూగుల్ టీవిలో కూడా వీడియో గేమ్స్‌ని నిక్షిప్తం చేయనున్నారు. లాస్ వేగాస్‌లో ఈరోజు నుండి మొదలైన 'కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2012(సిఈఎస్')'లో పలు రకాల కంపెనీ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనున్న రకరకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచిన విషయం తెలిసిందే.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot