Google Lookup తెలియని ఫోన్ నంబర్ల వివరాలు కోసం ట్రూకాలర్ తరహాలో గూగుల్ కొత్త టూల్..!
తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వారి వివరాలు తెలుసుకొనేందుకు ట్రూకాలర్ సహా ఇతర కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగిస్తుంటాం. అయితే గూగుల్ కూడా ఈ తరహా ఫీచర్‌పైన పనిచేస్తోందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌లో త్వరలో LookUp అనే కొత్త టూల్ రానుందని తెలుస్తోంది.
మన ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ల నుంచి మెసేజ్, కాల్ వచ్చినప్పుడు ఈ గూగుల్ కొత్త టూల్ (Google Lookup) వారి వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్ 127.0.620688474 లో మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే ఈ గూగుల్ Lookup టూల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని వివరాలు వెల్లడి కాలేదు. జూన్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ గూగుల్ కొత్త టూల్ అందుబాటులోకి వస్తే ట్రూకాలర్ యాప్ పై భారీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ట్రూకాలర్ క్లౌడ్ సోర్స్ ఆధారిత వివరాలను అందిస్తోంది. గూగుల్ కొత్త టూల్ దేని ఆధారంగా కాలర్ వివరాలను వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.
* ఫిబ్రవరి 2024 లో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కూడా ఇటువంటి సిఫార్సులు చేసింది. ఎవరు ఫోన్ చేసిన వారి పేరు మొబైల్ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సప్లిమెంటరీ సర్వీసులను (CNAP) అన్ని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ట్రాయ్ సిఫార్సు చేసింది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకున్న వారి పేర్లు మాత్రమే వారు కాలింగ్ చేసినప్పుడు డిస్‌ప్లే పైన కనిపిస్తున్నాయి. థర్ట్ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నట్లయితే క్లౌడ్ సోర్స్ ఆధారిత వివరాలు కనిపిస్తున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ సిఫార్సులు అమల్లోకి వస్తే ఎవరూ ఫోన్ చేసినా వారి వివరాలు వెల్లడి అవుతాయి.
కొత్త సిమ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు కస్టమర్ అప్లికేషన్ ఫాంలో నమోదు చేసిన వివరాలు మాత్రమే ఫోన్ చేసినప్పుడు కనిపిస్తాయి. ఇప్పటికే ట్రూ కాలర్, భారత్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి సంస్థలు క్లౌడ్ సోర్స్ డేటా ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాయి. అంటే మీ నంబర్‌ను ఇతరులు ఎలా సేవ్ చేసుకుంటే ఆ పేరునే ఈ సంస్థలు డిస్‌ప్లేపైన కనిపించేలా చేస్తున్నాయి.
ఇలాంటి సర్వీసులను పూర్తిస్థాయిలో విశ్వసించలేమని, అందులే కాలర్ ఐడెంటిఫికేషన్ అమలు చేసే విధంగా టెక్నికల్ మోడల్‌ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది. టెలికాం సంస్థలు ఈ తరహా సేవల్ని ప్రారంభించే విధంగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2022 సంవత్సరంలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదనలు చేయగా.. ఫిబ్రవరిలో తుది సిఫార్సులు చేసింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








