గూగుల్ 'ఆన్‌లైన్ టాబ్లెట్ స్టోర్' వెనుక రహాస్యం..?

Posted By: Prashanth

గూగుల్ 'ఆన్‌లైన్ టాబ్లెట్ స్టోర్' వెనుక రహాస్యం..?

 

వినియోగదారుల కోసం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా టాబ్లెట్ పిసిలకు సంబంధించిన ఆన్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంగా ప్రచురించింది. ఈ ఆన్‌లైన్ స్టోర్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఆస్టక్ కంప్యూటర్స్ కంపెనీలకు చెందిన టాబ్లెట్స్‌‌ల లిస్ట్‌ని ప్రదర్శనకు ఉంచనున్నారు. ఐతే గూగుల్ మాత్రం ఈ ఆన్‌లైన్ స్టోర్‌కు సంబంధించి అధికారకంగా ఎటువంటి ప్రకటనను మాత్రం విడుదల చేయలేదు.

2010వ సంవత్సరంలో వినియోగదారుల కోసం శాంసంగ్ నుండి గూగుల్ 'నెక్సస్ వన్' అనే స్మార్ట్ ఫోన్‌ని సొంతంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానుల అంచనాలను అందుకోలేక పోయినట్లు సమాచారం. ఐఫోన్ తయారీదారు ఆపిల్ కంపెనీకి గట్టి పోటీని ఇచ్చే భాగంలో పలు రకాల కంపెనీల భాగస్వామ్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఎదిగేలా చేసింది.

కానీ, ఆపిల్ మాత్రం టచ్ స్క్రీన్ రంగంలో తన ఐప్యాడ్ ద్వారా హావాని కొనసాగిస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆధారిత అమెజాన్ కిండల్ పైర్ టాబ్లెట్‌ని విడుదల చేసింది. ఐతే ఈ టాబ్లెట్ గూగుల్ సర్వీసులను పూర్తిగా వినియోగించుకోలేక పోతుంది. రాబోయే కాలంలో టాబ్లెట్స్ రంగంలో తనదైన ముద్ర వేసేందుకే గూగుల్ ఈ ఆన్‌లైన్ స్టోర్‌ని ప్రారంభిస్తుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot