యూట్యూబ్ యూజర్ల కోసం అధ్బుతమైన ఫీచర్ వస్తోంది

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ యాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనుంది. టేక్ ఎ బ్రేక్' పేరిట యూట్యూబ్‌లో ఆ ఫీచర్ యూజర్లను అలరించనుంది. ఎక్కువ సమయం వెచ్చించి యూట్యూబ్ వీడియోలను గంటల తరబడి చూడడంలో నిమగ్నమయ్యే వారికోసం ఈ ఫీచర్ ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం యూట్యూబ్ వీడియోలను వీక్షించడం వల్ల వాటికి వ్యసనపరులుగా మారి ఆరోగ్యాలను నాశనం చేసుకునే అవకాశం లేకుండా, వారు అలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు గాను టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌ను యూట్యూబ్‌లో అందివ్వనున్నారు. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే..

 

రోజుకు 100 కోట్ల గంటలు, యూట్యూబ్‌కే అంకితంరోజుకు 100 కోట్ల గంటలు, యూట్యూబ్‌కే అంకితం

టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌..

టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌..

యూట్యూబ్‌లో రానున్న ఈ టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌ను యాప్‌లోని సెట్టింగ్స్ - జనరల్ - రిమైండ్ మి టేక్ ఎ బ్రేక్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సెట్ చేసుకున్న టైం..

సెట్ చేసుకున్న టైం..

దీంతో యూజర్ సెట్ చేసుకున్న టైం (15, 30, 60, 90, 180 నిమిషాలు) ప్రకారం ఆ టైం పూర్తయ్యేసరికి యూట్యూబ్ స్క్రీన్‌పై మంకీ బొమ్మ కనిపిస్తుంది.

కొంత సమయం పాటు బ్రేక్..

కొంత సమయం పాటు బ్రేక్..

దాంతో వీడియోను చూడడం ఆపి కొంత సమయం పాటు బ్రేక్ తీసుకోవచ్చు. లేదంటే బొమ్మను తీసేసి వీడియోను చూడడం కంటిన్యూ చేయవచ్చు.

ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు ..
 

ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు ..

అయితే ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తరువాత ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తుంది.

ప్రతిరోజు 100 కోట్ల గంటల నిడివి గల వీడియోలను..

ప్రతిరోజు 100 కోట్ల గంటల నిడివి గల వీడియోలను..

తాజా విశ్లేషణ ప్రకారం యూట్యూబ్‌లో ప్రతిరోజు 100 కోట్ల గంటల నిడివి గల వీడియోలను వీక్షించటం జరుగుతుందట. 2015లో ఈ సమయం 50 కోట్ల గంటలుగా ఉంది. యూట్యూబ్‌లోని మొత్తం వీడియోలను సెర్చ్ చేయాలంటే ఏకంగా లక్ష సంవత్సరాలు పడుతుందట.

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య..

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య..

నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని.. భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు.

Best Mobiles in India

English summary
Google to roll out 'Take a Break' feature for YouTubers More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X