పోర్న్ దెబ్బ, రైల్వేలో గూగుల్ ఫ్రీ వైఫై బంద్, షాకిచ్చిన రైల్‌టెల్

By Gizbot Bureau
|

రైల్వే ప్రయాణికులకు గూగుల్ చేదు వార్తను అందించింది. రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫైను (Free public WiFi service) ఇకపై ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయని, అందుకే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం పోర్న్ దెబ్బేనని తెలుస్తోంది.

పోర్న్ దెబ్బే

పోర్న్ దెబ్బే

గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. 

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవక

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవక

ఈ విషయంపై గూగుల్‌ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు (Google Station) ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

మొబైల్ కనెక్టివిటీ

మొబైల్ కనెక్టివిటీ

2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.

రివర్స్ ట్విస్ట్ ఇచ్చిన రైల్‌టెల్ 

రివర్స్ ట్విస్ట్ ఇచ్చిన రైల్‌టెల్ 

దీనిపై రైల్‌టెల్ స్పందించింది. గూగుల్ సహకారం లేకుండానే దేశంలోని 5600 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కొనసాగిస్తామని రైల్‌టెల్ అధికారులు వెల్లడించారు.దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫైను గూగుల్‌ ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన నేపథ్యంలో రైల్‌టెల్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ 2015 నుంచి భారతదేశంలోని 400 కి పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను అందిస్తోంది. రైల్ టెల్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏ1, ఎ, సి కేటగిరీలకు చెందిన 415 రైల్వేస్టేషన్లలో మాత్రమే రైల్‌టెల్ టెక్నాలజీ భాగస్వామిగా ఉంది.అయితే ఇప్పుడు బీ, సీ, డీ రైల్వేస్టేషన్లలో కూడా ఉచితంగా వైఫై సౌకర్యం అందిస్తున్నామని రైల్ టెల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

గూగుల్ సహకరించకున్నా...

గూగుల్ సహకరించకున్నా...

గూగుల్ సహకరించకున్నా వైఫై ఉచిత సదుపాయాన్ని రైల్వేస్టేషన్లలో కొనసాగిస్తామని రైల్ టెల్ అధికారులు వివరించారు.భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయని, అందుకే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ అధికారులు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం పోర్న్ దెబ్బేనని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Google to wind down free public wifi service at rail stations, goodbye free internet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X