స్వలాభం ఉంది కాబట్టే గూగుల్ అలా చేస్తుంది..?

Posted By:

స్వలాభం ఉంది కాబట్టే గూగుల్ అలా చేస్తుంది..?

24 గంటల్లో ఏమైనా జరగొచ్చు. మొన్న 'కొరియన్ ఫెయిర్ ట్రేడ్ కమీషన్' మీద ఇన్విస్టిగేషన్ వేయమని చెప్పిన సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కేవలం 24 గంటల్లో తన మాట మార్చడమే కాకుండా 'కొరియన్ టెలికామ్ రెగ్యూలేటరీ'తో టైఅప్ అవుతున్నట్లు స్వయంగా టెలికామ్ రెగ్యులేటరీ నోటి ద్వారా చెప్పించడం విశేషం. ఈ డీల్ రెండు కంపెనీల మద్య ఉన్న ప్రతిస్దంభనను తొలగించింది.

అంతేకాకుండా కోరియాలో ఉన్న లోకల్ ఇంటర్నెట్ వెంచర్స్‌కి సెర్చ్ ఇంజన్ గెయింటా గూగుల్ తన సపోర్ట్‌ని అందివ్వనుంది. ఐతే వీరిద్దరి మద్య నున్న పార్ట్నర్ షిప్‌ని గూగుల్ అధికారకంగా మాత్రం ప్రకటించ లేదు. ఈ విషయాలన్నీ నవంబర్ లోనే పూర్తి అయినట్లు వినికిడి. నవంబర్‌లో గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ స్కామిడిస్ట్ దగ్గరుండి మరీ ఈ పనులను చక్కబెట్టినట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.

వీటితో పాటు కొరియా లోకల్‌గా ఉన్న కొన్ని ప్రాజెక్టలను గూగుల్ తీసుకోని వాటికి సపోర్ట్‌ని అందించడమే కాకుండా డెవలప్‌మెంట్ ఫండింగ్‌ని కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఐతే గూగుల్ ఇదంతా ఎందుకు చేస్తుందో అంతుబట్టకుండా ఉందని కొరియన్ సిటిజన్స్ అంటున్నారు. ఇందుకు గల కారణం మొదటి నుండి కూడా సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్‌కి ఆసియాలో ఇక్కట్లు పడుతూనే ఉంది.

గతయేడాది మే నెలలో గూగుల్ అనధికారకంగా డేటాని సేకరిస్తుందంటూ పోలీసులు గూగుల్ కంపెనీలపై రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటన్నింటిని తప్పించుకునే భాగంగా గూగుల్ లోకల్ ప్రాజెక్టులకు ఫండింగ్ చేస్తుందని మరి కొందరి వాదన.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot