గూగుల్ మీ అనుమతి లేకుండానే మీపై నిఘా పెడుతోందనే విషయం తెలుసా?
టెక్ దిగ్గజం గూగుల్ మీ అనుమతి లేకుండానే మీపై నిఘా పెడుతోందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టెక్ దిగ్గజం గూగుల్ మీ అనుమతి లేకుండానే మీపై నిఘా పెడుతోందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. యూజర్లు డోంట్ సేవ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసినప్పటికీ టెక్ దిగ్గజం గూగుల్ వారి లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తునట్టు బయటపెట్టింది. గూగుల్ యూజర్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ హిస్టరీ మొత్తం గూగుల్ అకౌంట్లో సేవ్ అయిపోతుంది.

ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరుండే చోటును .....
ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరుండే చోటును సేవ్ చేయడానికి వీల్లేకుండా మార్చుకున్నా సరే కొన్ని రకాల గూగుల్ సేవలను ఆండ్రాయిడ్ ఫోన్సలో , ఐఫోన్లలో ఉపయోగించిననప్పుడు మీ మూవ్మెంట్స్ యొక్క హిస్టరీ సేవ్ అయిపోతుంటుంది.

ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా....
ఈ వివరాలను ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా యూజర్ల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు.

నావిగేషన్ కోసం వాడే గూగుల్ మ్యాప్స్ తో పాటు.....
నావిగేషన్ కోసం వాడే గూగుల్ మ్యాప్స్ తో పాటు ఇతర యాప్ ల ద్వారా వినియోగదారుల సమాచారాన్ని ఈ టెక్ దిగ్గజం దొంగలిస్తోందని చెప్పింది.

200 కోట్ల మంది డేటాను గూగుల్ రికార్డు చేసింది......
ఇప్పటికి దాదాపు 200 కోట్ల మంది డేటాను గూగుల్ రికార్డు చేసింది. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేస్తే తాము వివరాలను రికార్డు చేయబోమని గూగుల్ చెప్పినా వాస్తవంలో అలా జరగడం లేదని పరిశోధకులు గుర్తించారు.

ఇంటర్నెట్ లో ఫుడ్ ఐటమ్స్ కోసం సెర్చ్ చేస్తే....
ఇంటర్నెట్ లో ఫుడ్ ఐటమ్స్ కోసం సెర్చ్ చేస్తే యూజర్ల లొకేషన్ ను గూగుల్ కేవలం 30 సెంటీమీర్ల తేడాతో గుర్తించి సేవ్ చేస్తోందని బయటపెట్టారు. అయితే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగానే లొకేషన్ వివరాలను వేర్వేరు యాప్స్ ద్వారా సేకరిస్తూ ఉంటామని గూగుల్ సంస్థ ప్రతినిధి దీని గురించి వివరణ ఇచ్చారు.

రికార్డు చేసిన లొకేషన్స్....
మై యాక్టీవిటి లో రికార్డు అయిన లొకేషన్స్ కేవలం యాడ్స్ కోసం టార్గెట్ చేసారని గూగుల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications








