గూగుల్ ప్లస్ విడుదలవకముందే కనుమరుగైపోతుందా?

Posted By: Super

గూగుల్ ప్లస్ విడుదలవకముందే కనుమరుగైపోతుందా?

కాలిఫోర్నియా: సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్ విడుదలకు నోచుకొక ముందే మూసేసుకునే అవకాశాలు ఉత్పన్నం అవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం గత కొన్నిరోజులు నుండి గూగుల్ ప్లస్‌లో ట్రాఫిక్ అనూహ్యంగా తగ్గడమే. వివరాల్లోకి వెళితే మార్కెట్ రీసెర్చర్ హిట్ వైజ్ అనే సంస్ద వెల్లడించిన దానిప్రకారం గూగుల్ ప్లస్ అభివృద్ది రేటు సడన్‌గా కొన్ని రోజుల నుండి 3శాతానికి తగ్గిందని తెలిపింది. హిట్ వైజ్ రిపోర్ట్ ప్రకారం జులై 23వ తారీఖు నాటికి అంతక ముందు వారంలో 1.86 మిలియన్ యూజర్లు గూగుల్ ప్లస్ వెబ్‌సైట్‌ని చూడగా, అదే జులై 23వ తారీఖు నాటికి కేవలం 1.79 మిలియన్ యూజర్లు మాత్రమే చూడడం జరిగిందని రిపోర్ట్‌లో తెలిపింది.

ఇక గూగుల్ ప్లస్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయిన యూజర్స్ కూడా అంతక ముందు 5నిమిషాల 50 సెకన్లు సైట్లో వారి కార్యకలాపాలను నిర్వర్తించగా, అదే యూజర్లు ఇప్పుడు కేవలం 5నిమిషాల 50 సెకన్లు పాటు వెబ్ సైట్‌ని చూడడం జరిగింది. దీనిని బట్టి చూస్తుంటే విడుదలకు నోచుకోక ముందే గూగుల్ ప్లస్ చనిపోయే పరిస్దితి వచ్చిందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే గూగుల్ ప్లస్ వెబ్ సైట్‌కి వచ్చిన యూజర్లు ఎక్కువ మంది గూగుల్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారంటూ ఇటీవల వార్త వచ్చిన సంగతి తెలిసిందే.

గూగుల్ ప్రస్తుతం గూగుల్ ప్లస్‌కి సంబంధించిన బీటా వర్సన్‌ని విడుదల చేసింది. అది కూడా గూగుల్ ప్లస్ స్నేహితుని ద్వారా ఎవరైతే ఇన్విటేషన్ పోందుతారో వారికి మాత్రమే గూగుల్ ప్లస్‌లో చేరే అవకాశం ఉంది. ఐతే ఇప్పుడు ఈ ఇన్విటేషన్స్‌ని కూడా గూగుల్ ప్లస్ తీసుకోవడం లేదు. దీనికి కారణం గూగుల్ ప్లస్ బీటా వర్సన్ విడుదల చేసిన మూడు వారాలకే 20 మిలియన్ యూజర్స్ అందులో చేరడమే. ఇక ప్రస్తుతం గూగుల్ ప్లస్ టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ అంతా పూర్తి అయిన తర్వాత గూగుల్ ప్లస్ ఓరిజినల్ వర్సన్‌‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే సడన్‌గా గూగుల్ ప్లస్ విజిట్స్ తగ్గడంతో గూగుల్ కంపెనీలో కొంత కలవరం మొదలైంది.

గూగుల్ ప్లస్‌లో ఉన్న బగ్స్ అన్నింటిని ఫిక్స్ చేసి త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గూగుల్ ప్లస్ రాకతో ఇప్పటి వరకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో ప్రపంచ నెంబర్ వన్ కొనసాగుతున్న ఫేస్‌బుక్‌కి గట్టి పోటీ ఇస్తుందనే భావిస్తున్నారు. ఈ పోటీని తట్టుకునేందుకు గాను ఫేస్‌బుక్ ఇటీవలే కొత్త కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెడుతుంది. అందులో భాగంగానే బిజినెస్ యూజర్స్ కోసం ఫేస్‌బుక్ బిజినెస్‌ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot