'గూగుల్ ప్లస్' అంతలా వెలిగిపోవడానికి కారణం

By Super
|
న్యూయార్క్: సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్ అనతి కాలంలోనే యూజర్స్ యొక్క మనసుని దొచుకుంది. ఇప్పడు అదే గూగుల్ ప్లస్ మరో రికార్డుని సొంతం చేసుకుంది. ఆ రికార్డు ఏమిటంటే సెప్టెంబర్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో ఏయే వెబ్ సైట్స్‌లను యూజర్స్ ఎక్కువగా సందర్శించారో లిస్ట్ చూస్తే అలాంటి టాప్ పది వెబ్ సైట్‌ల లిస్ట్‌లో గూగుల్ ప్లస్ స్దానం సంపాదించుకుంది.

టెక్నాలజీ బ్లాగుల ద్వారా అందిన కొత్త సమాచారం మేరకు సెప్టెంబర్ 24 తారీఖు వరకు గూగుల్ ప్లస్‌లో 15మిలియన్ విజిటర్స్ మాత్రమే ఉన్నారు. గత వారం ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌ని గూగుల్ ప్లస్ 1.8 బిలియన్ విజిటర్స్‌తో డామినేట్ చేయడం జరిగింది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అయిన హిట్‌వైజ్ తెలిపిన సమాచారం ప్రకారం గత వారం గూగుల్ ప్లస్ షేర్ మార్కెట్లో 1.269 శాతాన్ని ఎక్కవగా నమోదు చేయడం జరిగింది.

 

ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఫాస్టుగా అభివృద్ది చెందుకున్న వెబ్ సైట్‌గా గూగుల్ ప్లస్‌ని అభివర్ణిస్తున్నారు. అందుకు గల కారణం గూగుల్ ప్లస్ ముఖ్యంగా యూత్, కాలేజి స్టూడెంట్స్‌ని ఆకట్టుకోవడమేనని అన్నారు. ఇది మాత్రమే కాకుండా గూగుల్ ప్లస్ వెబ్‌సైట్ యూజర్స్‌కు అందించే ఆతిధ్యం అమోఘంగా ఉందని వాపోతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో గూగుల్ ప్లస్ అభివృద్దిని చూస్తే చాలా ఎక్కవగా ఉందని చెబుతున్నారు.

 

అతి తక్కవ కాలంలో మార్క్ జూకర్స్ బర్గ్ స్దాపించిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌కి పెద్ద పోటీగా గూగుల్ ప్లస్‌ని అభివర్ణిస్తున్నారు. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిట్‌వైజ్ ప్రతినిధి తెలిపిన దాని ప్రకారం యూజర్స ఫేస్‌బుక్ కంటే కూడా గూగుల్ ప్లస్ వైపుకి మరలడానికి కారణం గూగుల్ ప్లస్‌కి యూట్యాబ్, జీమెయిల్ లాంటి అదనపు ఫీచర్స్ ఉండడమే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X