గూగుల్ ట్రాన్స్‌లేట్‌లోకి కొత్తగా 13 భాషలు..
గూగుల్ ఆఫర్ చేస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ (Google Translate) ఒకటి. తాజాగా ఈ యాప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ను గూగుల్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.
గూగుల్ ఆఫర్ చేస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ (Google Translate) ఒకటి. తాజాగా ఈ యాప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ను గూగుల్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అప్‌డేట్ ప్రకారం గూగుల్ విజువల్ ట్రాన్స్‌లేటర్‌లో అదనంగా 13 కొత్త భాషలు యాడ్ అయ్యాయి.

50 భాషలకు విస్తరించించింది, తాజాగా మరో 13..
27 భాషలతో 2015లో ప్రాంభమైన గూగుల్ విజువల్ ట్రాన్స్‌లేషన్ 2018 నాటికి 50 భాషలకు విస్తరించించింది. తాజాగా మరో 13 భాషలు యాడ్ అవటంతో ఆ సంఖ్య 63కి చేరుకుంది. అరబిక్, బెంగాలీ, హిందీ ఇంకా పంజాబీ వంటి భాషలను గూగుల్ విజువల్‌గా ట్రాన్సలేషన్ చేయగలుగుతోంది.

ఇతర యాప్‌లలోని కంటెంట్‌ను సైతం...
ఈ మధ్య లాంచ్ చేసిన మరో అప్‌డేట్‌లో భాగంగా ఇతర అప్లికేషన్‌లలోని టెక్స్ట్‌ను సైతం గూగుల్ ట్రాన్స్‌లేట్ చేయగలుగుతోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలనుకున్నట్లయితే యాప్ సెట్టింగ్స్‌లో tap to translate అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఇతర యాప్‌లలోని కంటెంట్‌ను సైతం ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంటుంది.

రాని భాషను సైతం మాతృభాషలోకి..
గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి?

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
ముందుగా మీ వెబ్‌బ్రౌజర్ లేదా మొబైల్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. 'From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలనుకుంటున్నారు కాబట్టి 'To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజుర్లు గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు
రెండు భాషల సపోర్ట్‌తో 2006 ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్‌లేట్ సర్వీస్ 103 భాషలకు పెరిగి అంతకంతకు విస్తరిస్తోంది. ఈ సర్వీసను రోజుకు 20 కోట్ల మంది యూజర్లు యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు ఓ అంచనా. భారత్‌లో తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను గూగుల్ ట్రాన్స్‌లేట్ సపోర్ట్ చేస్తుంది.

రోజుకు 10 వేల కోట్ల పదాలు తర్జుమా..
హిందీ సహా 7 ప్రాంతీయ భాషలకు సంబంధించి వాయిస్ సెర్చ్‌ను గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆఫర్ చేస్తోంది. ఇంగ్లీష్ టు హిందీ విజువల్ ట్రాన్సలేషన్‌ను 2015లో గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పంచవ్యాప్తంగా 500 మిలియన్ యూజర్లు గూగుల్ ట్రాన్స్‌లేట్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు ఓ అంచనా. గూగుల్ ట్రాన్స్‌లేట్ రోజుకు 10 వేల కోట్ల పదాలను అనువాదం చేస్తోందట.


Click it and Unblock the Notifications








