కొత్త ఐడియా, గూగుల్ ప్లస్‌లో కూడా గూగుల్ ట్రాన్సలేట్

Posted By: Staff

Google Translate comes to Google+

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌కి పోటీగా సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గూగుల్ ప్లస్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గూగుల్ ప్లస్‌ని విడుదల చేసిన తర్వాత గూగుల్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిందని ఇటీవల మనం చదివాం. ఫేస్‌బుక్ నుండి కాంపిటేషన్ తట్టుకోవడానికి గూగుల్ ప్లస్‌లో రోజురోజుకీ ఫీచర్స్‌ని అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం గూగుల్ ప్లస్‌లో చేర్చిన కొత్త ఫీచర్ ఏంటని అనుకుంటున్నారా..

మీ పర్సనల్ కంప్యూటర్లో గనుక గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఇనిస్టాల్ చేసుకోని గూగుల్ ప్లస్‌కి కనెక్ట్ ఐతే మీకు ఆటో మ్యాటిక్‌గా గూగుల్ ట్రాన్సలేట్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే గూగుల్ ప్లస్‌లో ఫోస్ట్ చేసిన నాన్ ఇంగ్లీషు కంటెంట్ ఏది ఐతే ఉందో ఆ కంటెంట్ గూగుల్ ప్లస్‌లో ట్రాన్సలేట్ అవడం జరుగుతుంది. ఈ ఫీచర్‌ని చూసిన చూసిన చాలా మంది అవాక్కవుతున్నారు.

గూగుల్ ప్లస్‌లో ఉన్న ఫోస్ట్‌ని ట్రాన్సలేట్ చేయాలంటే యూజర్స్ మీకు నచ్చిన పోస్ట్ క్రింద భాగాన ఉన్న 'ట్రాన్సలేట్' బటన్ మీద క్లిక్ చేసినట్లైతే ఆటోమ్యాటిక్‌గా ట్రాన్సలేట్ చేసి చూపిస్తుంది. మరలా తిరిగి మీకు ఒరిజినల్ ఇంగ్లీషు కంటెంట్‌ని చూడాలంటే 'షో ఒరిజినల్' బటన్ మీద క్లిక్ చేస్తే యధావిధిగా కంటెంట్‌ని చూపిస్తుంది. మీరు ఏదైతే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ట్రాన్సలేట్‌లో ఇంగ్లీషు టు తెలుగు ట్రాన్సలేట్ చేస్తే ఎలా వస్తుందో సరిగ్గా అదే మాదిరి గూగుల్ ప్లస్ ట్రాన్సలేషన్‌లో వస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot