గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అదిరిపోయే అప్‌డేట్.. త్వరలో మీ టెక్స్ట్ మీ స్టైల్‌లో ట్రాన్స్‌లేట్ అవుతుంది!
Google Translate: గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ ఎన్నో ఏళ్లుగా కోట్లాది మందికి ఒక మంచి అనువాదకుడిగా ఉంటోంది. జీమెయిల్, డాక్స్, మెసేజెస్ యాప్స్‌లో గూగుల్ కొత్తగా ఏఐ ఫీచర్లు తెచ్చినా, ట్రాన్స్‌లేట్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ట్రాన్స్‌లేట్ యాప్‌కి పవర్ఫుల్ AI అప్‌గ్రేడ్ రాబోతోందని లీక్ అయింది. దీంతో ట్రాన్స్‌లేషన్స్ మరింత పర్‌ఫెక్ట్‌గా, మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు.
* గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో కొత్త ఏఐ ఫీచర్..
యాప్స్‌ని కనిపెట్టే 'AssembleDebug' అనే రీసెర్చర్ చెప్పిన దాని ప్రకారం, గూగుల్ ట్రాన్స్‌లేట్ కోసం అదిరిపోయే ఏఐ ఫీచర్‌పై గూగుల్ పనిచేస్తోంది. ఇప్పటికే మనం టెక్స్ట్, వాయిస్, కెమెరా ద్వారా ట్రాన్స్‌లేషన్స్ చేసుకుంటున్నాం. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ట్రాన్స్‌లేషన్స్‌ని మనకు నచ్చినట్టు మార్చుకునే వీలుంటుంది.

* "మరోలా చెప్పు" బటన్ వస్తోంది..
ఇందులో మెయిన్ హైలైట్ "ఆస్క్ ఏ ఫాలో-అప్" బటన్. అంటే మనం ఏదైనా టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ చేశాక, ట్రాన్స్‌లేషన్ పక్కనే ఈ బటన్ కనిపిస్తుంది. ట్రాన్స్‌లేషన్ బాగోలేదనిపిస్తే లేదా క్లారిటీ లేకపోతే, ఈ బటన్ నొక్కితే మరో వెర్షన్ వస్తుంది. దీంతో ట్రాన్స్‌లేషన్స్ మరింత కరెక్ట్‌గా, సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి.
* టోన్, స్టైల్ మీ ఇష్టం..
ఇంకో అదిరిపోయే విషయం ఏంటంటే.. ట్రాన్స్‌లేషన్ టోన్, స్టైల్‌ను కూడా మార్చుకోవచ్చు. ట్రాన్స్‌లేషన్స్‌ని ఫార్మల్‌గా, క్యాజువల్‌గా, ఇంకా ఫన్నీగా కూడా మార్చుకోవచ్చు. కష్టమైన ట్రాన్స్‌లేషన్స్‌ని సింపుల్‌గా మార్చేస్తుంది ఈ ఏఐ. అంతేకాదు, ప్రాంతాల ప్రకారం భాషలో మార్పులు చేసుకోవచ్చు. భాష నేర్చుకునేవాళ్లకి, ప్రొఫెషనల్స్‌కి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.
* జెమినితో స్మార్ట్ ట్రాన్స్‌లేషన్స్..
గూగుల్ ట్రాన్స్‌లేట్.. గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమినితో కలిసి పనిచేస్తుంది. ఒక డెమోలో, ఒక యూజర్ ట్రాన్స్‌లేషన్‌ని "టెక్నికల్ నెర్డ్ లా ఫన్నీగా మార్చు" అని అడిగితే, ఏఐ టెక్స్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా మార్చేసింది. ఈ ఫీచర్ ట్రాన్స్‌లేషన్స్‌కే కాదు, లాంగ్వేజ్ లెర్నింగ్‌కి, క్రియేటివ్ రైటింగ్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది.
* ఇంటర్నెట్ ఉంటేనే..
ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి, ఇది వర్క్ అవ్వాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. బేసిక్ ఆఫ్లైన్ ట్రాన్స్‌లేషన్స్‌లా కాకుండా, ఏఐ పవర్డ్ ఫీచర్స్ క్లౌడ్ ప్రాసెసింగ్‌తోనే కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈ ఫీచర్ గురించి ఇది మొదటిసారి లీక్ అవ్వడం కాదు. ఇంతకుముందు కూడా దీని గురించి లీక్స్ వచ్చాయి.
కానీ అప్పుడు ఫీచర్ ఎలా పనిచేస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు AssembleDebug.. గూగుల్ ట్రాన్స్‌లేట్ వెర్షన్ 9.3.78.731229477.7లో ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేసి, అది ఎలా పనిచేస్తుందో చూపించారు. ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, దీన్ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేయగలుగుతున్నారు అంటే త్వరలోనే గ్లోబల్ రిలీజ్ ఉండొచ్చు.
* ఈ అప్‌డేట్ ఎందుకంత ముఖ్యం
ఈ అప్‌డేట్ పెద్ద రెవల్యూషన్ కాకపోయినా, చాలా ఉపయోగకరమైన ఫీచర్స్‌ని అందిస్తుంది. ట్రాన్స్‌లేషన్స్‌పై యూజర్స్‌కి మంచి కంట్రోల్ వస్తుంది. దీంతో ట్రాన్స్‌లేషన్స్ మరింత కరెక్ట్‌గా, ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి. ఇది కొత్త భాషలు నేర్చుకోవడానికి, కరెక్ట్ టోన్‌లో మెసేజ్‌లు రాయడానికి, ప్రాంతీయ భాషలకు తగ్గట్టు ట్రాన్స్‌లేషన్స్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ, ఈ అప్‌డేట్ గూగుల్ ట్రాన్స్‌లేట్‌ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తుంది.


Click it and Unblock the Notifications








