గూగుల్ ‘కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్’

Posted By:

ఎలాంటి డిస్‌ప్లేనైనా పర్సనల్ కంప్యూటర్‌గా మార్చేసే ‘కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్'ను గూగుల్ ఇంకా ఆసుస్‌లు సంయుక్తంగా ఆవిష్కరించనున్నాయి. ఆసుస్ క్రోమ్ బిట్ పేరుతో వస్తోన్న ఈ క్యాండీ బార్ తరహా స్టిక్‌కు సంబంధించిన వివరాలనుగూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. క్యాండీబార్ కన్నా చిన్నగా ఉండే ఈ క్రోమ్ బిట్ కంప్యూటర్ ధర 100 డాలర్లలోపే ఉండొచ్చని గూగుల్ వెల్లడించింది.

గూగుల్ ‘కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్’

డెస్క్‌టాప్ కంప్యూటర్లకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న ఈ కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్‌ను ఎలాంటి డిస్‌ప్లే‌కైనా కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక డివైస్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ ఏడాది మధ్యనాటికి మార్కెట్లో లభ్యమయ్యే అవాకశం ఉంది.

గూగుల్ ‘కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్’

ఇదే బ్లాగ్‌ స్టేట్‌మెంట్‌లో భాగంగా తక్కువ ధర క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లను గూగుల్ ప్రకటించింది. చైనా ఎలక్ట్ర్రానిక్ గ్రూప్స్ అయిన హైయిర్ ఇంకా హైసెన్స్‌ల భాగస్వామ్యంతో ఈ కంప్యూటర్‌లను 149 డాలర్లకే ఆఫర్ చేస్తామని గూగుల్ వెల్లడించింది. 11.6 అంగుళాల డిస్‌ప్లేతో లభ్యమయ్యే హైయిర్ కంప్యూటర్‌లను అమెజాన్ ద్వారా, హైసెన్స్ పీసీలను వాల్‌మార్ట్ ద్వారా విక్రయిస్తామని గూగుల్ తెలిపింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Google unveils 'computer-on-a-stick'. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot